Locations: Krishna

  • రేపు నరసాపురంలో మంత్రి నిమ్మల పర్యటన

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో బుధవారం నిర్వహించనున్న ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరుకానున్నానున్నారని టీడీపీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తుల తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

     

     

  • వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడమే: MLA కాగిత

    కృష్ణా: పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. కాకర్లమూడిలో పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయలేదన్నారు.

  • ‘సూపర్ సిక్స్ పథకాలు.. జెట్ స్పీడ్‌లో అమలు చేస్తోంది’

    ఎన్టీఆర్: గంపలగూడెం మండలం కొత్తపల్లిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను జెట్ స్పీడ్‌లో అమలు చేస్తోందని వారు పేర్కొన్నారు.

  • గూడూరులో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

    కృష్ణా: పెడన నియోజకవర్గం గూడూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఉప్పాల రమేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. గూడూరు సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • కంచికచర్లలో సిగరెట్ దుకాణాలపై దాడులు

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో సిగరెట్ దుకాణాలపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. సిగరెట్లు అమ్మే బడ్డీ కోట్లలో విదేశీ సిగరెట్లను అమ్ముతున్నారని సమాచారం ఉండటంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై రాజు ఆధ్వర్యంలో సిబ్బంది కంచికచర్లలో ఉన్న సిగరెట్ బండి కొట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఎస్సై కోరారు.

  • నందిగామలో నకిలీ సిగరెట్ల దందా.. కోట్లలో వ్యాపారం!

    ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గ పరిధిలోని నకిలీ సిగరెట్లు వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రముఖ బ్రాండ్లతో పోలి ఉండేలా నకిలీ సిగరెట్ల తయారు చేసి వాటిని మార్కెట్లో పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. లాభం కూడా ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు సాగిస్తున్నారు. సిగరెట్లలో వాడుతున్న నాసిరకం పొగాకు ప్రజలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వినియోగదారులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టగలరని ప్రజలు కోరుతున్నారు.

  • పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనేదే లక్ష్యం: MLA

    కృష్ణా: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడాలనేదే తన లక్ష్యమని ఆయన అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

  • నందిగామలో విదేశీ సిగరెట్లు సీజ్

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో విదేశీ సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. శ్రీవిద్య స్కూల్ సమీపంలో ఒక దుకాణంలో వీటిని గుర్తించారు. ఏసీపీ తిలక్ తన బృందంతో కలిసి దాడి చేసి, రూ.లక్ష విలువైన వివిధ రకాల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. సేలం బ్రహ్మేశ్వరరావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఎదగాలని ఏసీపీ సూచించారు.

  • టీడీపీ నేతలకు సన్మానం

    ఎన్టీఆర్: విస్సన్నపేటలో టీడీపీ కార్యకర్తల సందడి నెలకొంది. పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన రాయల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాసరావులను ఆర్ అండ్ బీ అధికారులు, డీఈవో, ఏఈలు దుశ్శాలువాలతో సత్కరించారు.

  • విద్యార్థినికి రోటరీ క్లబ్ ఆర్థిక సహాయం

    కృష్ణా: ఉయ్యూరులోని వీఆర్‌కేయమ్ పాఠశాల పూర్వ విద్యార్థిని అబ్దుల్ షాహినాకు బీఎస్సీ మూడవ సంవత్సరం ఫీజు కోసం రోటరీ క్లబ్ సభ్యుడు నాగేశ్వరరావు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవీరావు మాట్లాడుతూ..గత మూడేళ్లుగా నాగేశ్వరరావు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి అమీర్ మీర్జా, తదితరులు పాల్గొన్నారు.