Locations: Krishna

  • విస్సన్నపేటలో రహదారి మరమ్మతులు

    ఎన్టీఆర్: విస్సన్నపేటలోని శ్రీ ఎదురు పలగాని వారి బజారులో గుంతలమయంగా ఉన్న రహదారిని లలితా రామకృష్ణ సౌజన్యంతో యాష్ గ్రావెల్ వేసి సరిచేశారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ నెక్కలపు వెంకటరావు, పలగాని మాధవరావు, వెంకటేశ్వరావు (గుమ్ము) పాల్గొన్నారు. ఈ మరమ్మతు పనులతో స్థానికులకు సౌకర్యవంతమైన రహదారి అందుబాటులోకి వచ్చింది.

     

  • ‘చండ్రుపట్లలో టీడీపీ పూర్వ వైభవానికి కృషి’

    ఎన్టీఆర్: టీడీపీ కంచుకోట చండ్రుపట్లలో పార్టీ పూర్వ వైభవం రావడానికి కృషి చేస్తానని మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. చండ్రుపట్లలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మాధవరావు, వెంకటనారాయణ, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

  • ఏపీవో రామారావుకు మాతృవియోగం

    ఎన్టీఆర్: విసన్నపేట మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ రామారావు మాతృమూర్తి జంపన శశిరేఖ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీవో చిన్నరాట్నాలు, ఇతర అధికారులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రామారావును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

    AP : విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఈరోజు నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు మూడు రోజులపాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు.

  • నాదెళ్ల తులసీరత్నం ఇకలేరు!

    కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ప్రముఖ సమాజ సేవకురాలు, వితరణ శీలి నాదెళ్ల తులసీరత్నం(102) కన్నుమూశారు. రవాణాశాఖ విశ్రాంత జిల్లా అధికారి నాదెళ్ల శివరామకృష్ణకు తులసీరత్నం మాతృమూర్తి. పురిటిగడ్డలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 80సెంట్ల స్థలాన్ని ఆమె స్వచ్చందంగా దానం చేశారు. అంతేకాకుండా ఆ భవన నిర్మాణం జరిగేవరకూ ఏళ్ల తరబడి గ్రామంలో పీహెచ్సీ నడిపేందుకు ఉచితంగా సొంత ఇంటిని సమకూర్చారు.

  • దుర్గమ్మ బంగారం SBIలో డిపాజిట్‌.. ఎంతంటే

    AP : శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన 29.510 కిలోల బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) గాంధీనగర్‌ బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేశారు. డిపాజిట్‌పై సంవత్సరానికి 0.60శాతం వడ్డీ లభిస్తుందని EO శీనానాయక్‌ తెలిపారు. డిపాజిట్‌ చేసిన బంగారం విలువ రూ.26.58 కోట్లు ఉంటుందన్నారు. నగల నిర్ధారణ అధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పల్లంరాజు, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, సమక్షంలో బంగారాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

  • నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకర్ల జాబితా విడుదల

    AP : నీట్‌ యూజీ-2025లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. రాష్ట్రం నుంచి 57,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా… 36,776 మంది కనీస మార్కులు సాధించి.. MBBS, BDS, ఇతర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి వరుస క్రమంలో ర్యాంకులు పొందిన విద్యార్థుల జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించింది.

  • అన్యాయం జరిగింది.. న్యాయం చేయండి!

    కృష్ణా: మచిలీపట్నంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద గ్రామ వ్యవసాయ సహాయకుల నిరసన తెలిపారు. బదిలీలలో అన్యాయం జరిగిందని, తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో అంత దూరం ఎలా వెళ్లగలమని వారు అధికారులను వేడుకుంటున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

  • ’కేసులు పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది’

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో వైసీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పోస్టర్‌ను పార్టీ పరిశీలికలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా కనబడుతుందని ఆరోపించారు.

  • ‘అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ తప్పనిసరి’

    కృష్ణా: అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులందరూ ఈనెల 10వ తేదీలోపు ఈకేవైసీ పూర్తిచేసుకోవాలని ఘంటసాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఈకేవైసీ తప్పనిసరి చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.