Locations: Krishna

  • ఏడాదిలోనే 5వేల స్కూళ్లు మూసివేశారు: కాంగ్రెస్‌ నేత

    ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత చింతామోహన్‌ ధ్వజమెత్తారు. అసలు పేదలు చదువుకోవడం అనేది చంద్రబాబుకు అస్సలు ఇష్టం ఉండదని విమర్శించారు. అందుకే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారని ఆరోపించారు.

  • రప్పా రప్పా అని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా: మంత్రి

    కృష్ణా: రప్పా రప్పా అని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి కొల్లు రవీంద్ర, వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. జగన్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సినిమాల్లో డైలాగులు చెబితే తప్పేంటని నీసిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏడాదిగా రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అరాచక వాదులకు మాట్లాడే హక్కు లేదని, వైసీపీ 11నుంచి ఒకటికి పడిపోతుందని హెచ్చరించారు.

  • మ్యాజిక్ డ్రెయిన్‌ నిర్మాణాలకు శ్రీకారం

    ఎన్టీఆర్: నందిగామలో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌లను 13జిల్లాల ఉపాధి హామీ సాంకేతిక ఉద్యోగులు సోమవారం పరిశీలించారు. రాష్ట్రంలోని 13జిల్లాల్లో పైలట్ గ్రామాలను ఎంపిక చేసి ఈ మ్యాజిక్ డ్రెయిన్‌ నిర్మాణాలను రాష్ట్రప్రభుత్వం చేపడుతోంది. గ్రామాల్లో పరిశుభ్రత, కాల్వల చెత్త సమస్యలను పరిష్కరించేందుకు కూటమిప్రభుత్వం ఈ వినూత్న డిజైన్‌ను చేపట్టింది. ఇంటి నీరు భూమిలో ఇంకేలా రూపొందించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.

  • పెడనలో పొగాకు ఉత్పత్తులపై తనిఖీలు

    కృష్ణా: జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు పెడన ఎస్‌ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పెడన పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలు,కళాశాలల సమీపాల్లో ఉన్న పొగాకు ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పిల్లల ఆరోగ్య దృష్ట్యా 2003పొగాకు నియంత్రణ చట్టం(COTPA) నిబంధనల మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై జరిమానాలు విధించారు. పొగాకు ఉత్పత్తులు అమ్మకానికి లేదనే బోర్డులు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు.

  • జలధీశ్వరాలయ అభివృద్ధికి NRI కుటుంబం విరాళం

    కృష్ణా: ఘంటసాలలోని శ్రీబాల పార్వతీ సమేత శ్రీ జలధీశ్వరస్వామి దేవాలయంలో సంగుబట్ల వెంకట బాల శశిధర్, మాధురి దంపతులు రూ.లక్ష విరాళాన్ని తమ మొక్కుబడిగా నెరవేర్చారు. అమెరికాలోని నార్త్ కెరొలినా నుంచి వచ్చిన వారు, కుమార్తెలు రాగ సుగుణశ్రీ, ధన్వి, కుమారుడు గుహన్ మహాదేవ్‌తో కలిసి దేవాలయ అభివృద్ధికి విరాళం అందించారు. అర్చకులు దాలిపర్తి చలపతిరావు విశేష పూజలు నిర్వహించి ఆశీర్వదించారు.

  • ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

    కృష్ణా: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, 31వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం చల్లపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండాను సర్పంచ్ కృష్ణకుమారి ఆవిష్కరించారు. మాదిగ జాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనకు పద్మశ్రీ రావడం గర్వకారణమని ఆమె అన్నారు.

  • నాగయలంకలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

    కృష్ణా: నాగాయలంక మండలంలో గత 20రోజులుగా మట్టి మాఫియా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతోంది. 1500కు పైగా టిప్పర్లతో, అనుమతులు లేని పదికి పైగా ప్రదేశాల్లో తవ్వేస్తున్నారని, రెవెన్యూ అధికారుల అండదండలు కూడా ఉన్నాయని ఆరోపణలున్నాయి. లారీల అతివేగంతో రోడ్లు పాడవుతున్నాయని, వర్షాకాలానికి పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

  • ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: MLA

    కృష్ణా: ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

  • ‘మహిళా సాధికారతకు ప్రభుత్వం భరోసా’

    ఎన్టీఆర్: మహిళ సాధికారిత కోసం కోసం ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి తెలిపారు. నందిగామ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సంస్థల ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్స్ కాలపరిమితి పెంచిన కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యేకు తంగిరాల సౌమ్య ఆదేశాలతో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.

     

  • నాట్స్ సేవలు వెలకట్టలేనివి: శాప్ ఛైర్మన్

    ఎన్టీఆర్: రాష్ట్రాభివృద్ధిలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) చేస్తున్న సేవలు ఎనలేనివని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపా సిటీలో నాట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాల్లో శాప్ ఛైర్మన్ సోమవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు.