కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ కె.చంద్రశేఖర్, ఆర్డీఓ కె.స్వాతి తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత: మంత్రి
కృష్ణా: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం 45వ డివిజన్ టీడీపీ ఇన్‌ఛార్జి పీవీ ఫణికుమార్ ఆధ్వర్యంలో సోమవారం డివిజన్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దాత సురేష్ సమకూర్చిన 150మొక్కలను జిల్లా కోర్టు రోడ్డు, జిల్లా జడ్జి బంగ్లా రోడ్డులో ఇరువైపులా నాటారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.
-
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
కృష్ణా: పామర్రు పోలీసులు ఐదుగురు అంతర్‌జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ధీరజ్‌వినిల్ గుడివాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు కృష్ణ.. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నేరాలు చేసి జైలుకెళ్లారు. అక్కడ స్నేహం ఏర్పడి, ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారన్నారు.
-
ప్రాణాలు పోయేలా ఉన్నాయ్.. పట్టించుకోండి మహాప్రభో!
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సుమారు ఏడుగురు పైగా డాగ్ వైట్ కేసు నమోదనట్లు సమాచారం. పాఠశాలలకు వెళ్ళే పిల్లలపై కుక్కలు దాడి చేస్తున్నాయని, వృద్ధులను కూడా వదలడం లేదని స్థానికులు వాపోతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
ఏడాది పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి పథం: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: వైసీపీ ఐదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం కూటమి ఏడాది పాలనలోనే చేశామని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. జగ్గయ్యపేట పట్టణం సీతారామపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కరపత్రాలు పంచుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజలు సీసీరోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, ఇళ్లపట్టాలు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
-
జిల్లా అభివృద్ధికి ప్లానింగ్ బోర్డు: మంత్రి కొల్లు
కృష్ణా: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం 45వ డివిజన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అభివృద్ధికి ప్లానింగ్ బోర్డ్‌ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. విజన్-2047లో భాగంగా అన్ని రంగాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని ఆయన అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.
-
మోడీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తి
ఎన్టీఆర్: విస్సన్నపేటలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ‘వికసిత భారతదేశపు అమృతకాలం- సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోడీ 11 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమానికి చేపట్టిన పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పులపాక బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
-
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం: ఎమ్మెల్యే ప్రసాద్
కృష్ణా: ఉయ్యూరు మండలం గండిగుంటలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వసతి కల్పిస్తామని తెలిపారు.
-
చల్లపల్లిలో రేషన్ బియ్యం పట్టివేత
కృష్ణా: చల్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నారాయణరావు నగర్ కాలనీలో తనిఖీలు నిర్వహించి, 1660 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాఘవులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేదలకు చేరాల్సిన బియ్యం అక్రమంగా నిల్వ చేయడం నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.