Locations: Krishna

  • విజయవాడ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

    AP: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. YCP విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో హెల్త్‌ యూనివర్సిటీ దాకా భారీగా ర్యాలీకి వచ్చారు. విద్యార్థి నేతలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో విద్యార్థి నాయకులు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భైటాయించి నిరసన తెలుపుతున్నారు.

  • యూరియా నిల్.. రైతుల గుండెల్లో హడల్!

    కృష్ణా: కోడూరు మండలంలో యూరియా కొరత రైతులను కలవరపెడుతోంది. వ్యవసాయం ప్రారంభమైనా, నారుమడులకు ఎరువు అందుబాటులో లేకపోవడంతో రైతులలో భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. ఎరువులు లేకపోతే పంటలు ఎలా పండుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • వీరమ్మతల్లి అమ్మవారికి సారె సమర్పణ

    కృష్ణా: ఉయ్యూరులో ప్రసిద్ధిగాంచిన పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి ఆలయంలో ఆషాడ సారే ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పారుపూడి వంశస్థులు అమ్మవారికి సారే సమర్పించారు. ఈ సారే కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని పాల్గొన్నారు.

  • దిగ్విజయంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం తాతకుంట్ల, గౌరంపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆయన ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో వీరమాచినేని కృష్ణ ప్రసాద్, కోలేటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

  • ‘ఏ పార్టీలో ఉన్న ఐకమత్యంగా ఉండాలి’

    ఎన్టీఆర్: అందరూ ఐకమత్యంగా ఉండాలని విజయ్‌కుమార్ అన్నారు. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో సోమవారం ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొండపాటి విజయ్‌కుమార్ ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. మందకృష్ణ మాదిగ విశిష్టతను, రిజర్వేషన్ కోసం ఆయన 31ఏళ్లుగా పడిన కష్టాన్ని మాదిగ సోదరులకు తెలియజేశారు. మాదిగజాతి రాజకీయంగా ఏ పార్టీలో ఉన్న ఎటువంటి గొడవలకు పోకుండా అందరూ ఐక్యమత్యంగా ఉండాలన్నారు.

  • ఒక్కరోజు ఆదాయం.. రూ.9.61 లక్షలు

    కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక్కరోజు ఆదాయం రూ.9.61లక్షలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వివిధ సేవా రుసుముల ద్వారా ఆదివారం 9.61లక్షలు స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. ఈ ఆదాయంతో భక్తులకు సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

  • ’13 నుంచి ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు’

    ఎన్టీఆర్: కాకినాడ హరిత బెర్మ్ పార్కులో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, P4, నీటి సంరక్షణ వంటి ఇతివృత్తాలపై చిత్రాలు వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులతో పాటు ఆసక్తి గలవారు ఎవరైనా పాల్గొనవచ్చని చెప్పారు.

  • 11టన్నుల కూరగాయలతో అమ్మవారి అలంకరణ

    కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కొండాలమ్మవారు శ్రీ శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 టన్నుల కూరగాయలు, 250 కిలోల ఆకుకూరల అలంకరణలతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

  • గుడివాడలో డ్రంక్&డ్రైవ్ తనిఖీలు

    కృష్ణా: గుడివాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. నందివాడ మండలంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 10మందిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • నేడు పీజీఆర్‌ఎస్.. ఈ ప్రాంతాల్లో!

    ఎన్టీఆర్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు మూడు సర్కిళ్లలోనూ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నగర ప్రజలు సమస్యలు, మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులను వినతుల రూపంలో అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.