Locations: Krishna

  • నేడు కలెక్టరేట్‌లో అర్జీల స్వీకరణ

    ఎన్టీఆర్ జిల్లాలో నేడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. సోమవారం అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్/నగరపాలక సంస్థ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వినతి పత్రాలు స్వీకరించనున్నట్టు వివరించారు.

  • రేపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

    కృష్ణా: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అధ్యక్షతన రేపు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పామర్రు ఆరేపల్లి కల్యాణ మండపంలో ఈనెల 8న మధ్యాహ్నం 3గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు వైసీపీ మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

  • 10 వరకే అన్నదాత-సుఖీభవ ఫిర్యాదుల స్వీకరణ

    కృష్ణా: అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందేందుకు గత నెల 30వ తేదీ వరకు వెబ్‌ల్యాండ్‌లో నమోదైన రైతుల భూమి ఖాతాలకు అర్హత కల్పించినట్లు వ్యవసాయశాఖ అధికారి శివ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాత సుఖీభవకు అర్హతపై రైతుల ఫిర్యాదులను ఈనెల 10వ తేదీ వరకు రైతుసేవా కేంద్రాల ద్వారా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి విరాళం

    కృష్ణా: మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.10,116, గోశాల గడ్డి కోసం రూ.10,116ను రేపల్లె గ్రామ వాస్తవ్యులు రాము, ఝాన్సీ రాణి దంపతులు విరాళం ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

  • కోడూరులో వాహనాల తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే..

    కృష్ణా: కోడూరు మండల పరిధిలో ఎస్సై చాణక్య ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. లైసెన్స్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని అన్నారు.

  • ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతోత్సవాలు

    ఎన్టీఆర్: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతోత్సవాలను బీజేపీ తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆనాడు భారతీయ జన సంఘ్ పార్టీని ఎందుకు స్థాపించవలసి వచ్చిందో అప్పటి పరిస్థితులను కార్యకర్తలకు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు,  జిల్లా కార్యదర్శి పోలే శాంతి, తదితరులు పాల్గొన్నారు.

  • తొలి ఏకాదశి వేళ.. ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ

    ఎన్టీఆర్: తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్‌ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండపైనుంచి దిగువకు పంపేందుకు ఈవో శీనానాయక్‌తోపాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.

  • మచిలీపట్నంలో ఘనంగా మొహర్రం వేడుకలు

    కృష్ణా: మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో షియా ముస్లింలు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. మొహర్రం అంటే పండగ కాదని, దుఃఖ దినాలను సూచిస్తూ, కర్బలా యుద్ధంలో 71 మంది అనుచరులతో ధర్మ రక్షణ కోసం హుస్సేన్ వీరోచితంగా పోరాడారు. గుర్రం ప్రతిమలతో ఊరేగింపు, చెస్ట్ బీటింగ్ కార్యక్రమాలు జరిగాయి. వివిధ పార్టీ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలు చేశారు.

     

  • చల్లపల్లిలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

    కృష్ణా: చల్లపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ మణికంఠ 53మందిని పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి వాస్వియన్ బూర్లె పిచ్చి కృష్ణ దంపతులు, వారి కుమారుడు ఆర్థిక సహకారం అందజేశారు. కార్యక్రమంలో గోళ్ళ ద్రోణ పూర్ణచంద్రరావు, అన్నం సత్యవాణి, ఉరిమి సువర్చల, గుండు గణపతి, కుసుమ, జ్యోతి తమ సేవలను అందించారు.

  • గోగినేనిపాలెంలో యువకుడు మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే..

    కృష్ణా: ఘంటసాల మండలం గోగినేనిపాలెం గ్రామం నుంచి కుంపటి అనిల్ అనే 24ఏళ్ల యువకుడు ఈనెల 1వ తేదీన కనిపించకుండా పోయాడు.  ఎవరికైనా అతని ఆచూకీ తెలిసిన వారు 9440796472 నెంబర్‌కు తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.