Locations: Krishna

  • పెడనలో మైనింగ్ రవాణా జోరు.. అధికారుల అండ తోడు!

    కృష్ణా: పెడన మండలంలో మైనింగ్ రవాణా రోజురోజుకీ వేగం పుంజుకుంటోంది. మండలానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అండతోపాటు పార్లమెంట్ సభ్యుని అనుచరుల మద్దతుతో ఈ రవాణా మరింత బలపడుతోంది. తాజాగా మడక,నందమూరు గ్రామాల సరిహద్దుల్లోని పంటపొలాలు పూడిపోతున్నా అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు గుప్పుమంటున్నాయి. అటు రాజకీయ అండదండలతో.. అధికారుల కోపరేషన్‌తో ఈమైనింగ్ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

  • రేపు వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమం విజయవంతం చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. సోమవారం పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, పార్టీ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నందిగామ మాజీ ఎమ్మెల్యే&ఇన్‌ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు హాజరవుతారు.

  • నూతన ఛాయ్ క్లబ్ ప్రారంభం

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలులోని మెయిన్ రోడ్డులో అంగజాల కాశీ ఆధ్వర్యంలో నూతనంగా ‘ఛాయ్ క్లబ్’ టీ & జ్యూస్ షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరై షాపును ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం’

    ఎన్టీఆర్: ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాబు జగ్జీవన్‌రామ్ 39వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

  • ‘చంద్రబాబు పాలనలో సంక్షేమం రెట్టింపు’

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య స్వయంగా ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ పథకాలను వివరించారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం రెట్టింపు అయిందని ఆయన తెలిపారు. తల్లికి వందనం, దీపం, రైతు సంక్షేమం వంటి పథకాలతోపాటు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆదరణతోనే ఇది సాధ్యమైందని అన్నారు.

  • ‘జగ్జీవన్‌రామ్‌ అడుగుజాడల్లో నడవాలి’

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం కొండపర్వలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ పలువురు వక్తలు మాట్లాడారు. ముఖ్యంగా యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహానుభావుల ఆశయాలను కొనసాగించాలని అన్నారు. కుల, మత భేదాలు లేకుండా సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఉద్బోధించారు.

  • జగజ్జీవన్ రామ్‌ వర్థంతి..మాజీ మంత్రి నివాళి

    ఎన్టీఆర్: విజయవాడలోని వైసీపీ పశ్చిమ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి జరిగింది. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ‘గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్’

    ఎన్టీఆర్: గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా టీడీపీ విస్సన్నపేట మండల అధ్యక్షులు రాయల సుబ్బారావు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతనం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నర్సాపురం బుడ్డయ్య, విస్సన్నపేట నెక్కలపు వెంకటేశ్వరరావు(బద్దె), సూపర్ బజార్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

  • ప్రజా సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే

    కృష్ణా: బంటుమిల్లి మండలం కొర్లపాడులో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

  • పెట్స్ ఆరోగ్యంగా ఉంటేనే..!

    ఎన్టీఆర్ట్: ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవం సందర్భంగా నందిగామలో రాబిస్ నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. పెంపుడు జంతువులకు టీకాలు ఇప్పించడం వల్ల మనుషులకు వచ్చే జబ్బులను నివారించవచ్చని సూచించారు.