Locations: Krishna

  • ఆయన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే!

    ఎన్టీఆర్: నందిగామలోని కాకాని నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన సేవలను కొనియాడారు.

  • అనగారినవర్గాల కోసం కృషి చేసిన మహానీయుడు

    ఎన్టీఆర్: నందిగామలో బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పార్టీ నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి, గాంధీ సెంటర్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..జగ్జీవన్‌‌రామ్ అనగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడని, దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు.

  • ‘ఇకపై ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చం’

    ఎన్టీఆర్: నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో గొడవలకు పాల్పడేవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపై ఎటువంటి వివాదాల్లోనూ తలదూర్చమని వారంతా ప్రమాణం చేశారు. నందిగామలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని పట్టణ సీఐ నాయుడు తెలిపారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • సచివాలయ సిబ్బందికి వీడ్కోలు సభ

    కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బదిలీపై వెళ్తున్న సచివాలయ అధికారులు ఫణి, డయాన, పద్మా, ప్రతిమాల సేవలకు కృతజ్ఞతగా పంచాయతీ అవరణలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ శీలం శ్రీనివాస్, జనసేన గ్రామ అధ్యక్షులు కొండవీటి నాని, కొండవీటి కోటి తదితరులు వారిని సన్మానించారు.

  • నరసాపురంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం నరసాపురంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని సూర్యదేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు, సీనియర్ నాయకులు మట్టా వేణుగోపాల్ దంపతులను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

  • భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి జరుపుకోవాలి: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: తొలి ఏకాదశి సందర్భంగా నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య  శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడ మాసంలో వచ్చే ఈ పర్వదినం ఎంతో పవిత్రమైనదని, ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారని అన్నారు. అందరూ భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ఆయన ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

  • శాకంబరీ దేవిగా తిరుపతమ్మ దర్శనం

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు ఆదివారం ఉదయం శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. గోపయ్య సమేత అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

  • యువతకు ప్రాధాన్యత: ఎంపీ కేశినేని

    ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఏ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట మండలాల్లోని యువకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియ టీడీపీని ప్రజలకు చేరువ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విస్సన్నపేటలోని ఓ పెద్ద కుటుంబానికి చెందిన యువత, తమ పెద్దల పేరు నిలబెట్టేందుకు త్వరలో మండలంలోని గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

     

  • ‘ఆదర్శప్రాయుడు జగ్జీవన్‌రామ్‌’

    ఎన్టీఆర్: విసన్నపేటలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఐక్యవేదిక సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన ఆదర్శంగా నిలుస్తారని వక్తలు అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, లాజర్, పాములక్ష్మయ్య, కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

  • లారీ, ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

    ఎన్టీఆర్: వత్సవాయిలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో తాళ్లూరి వెంకటేష్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పెనుగొండ బాలు, రాయల రాంబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆగ్రహించిన గ్రామస్థులు లారీ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.