Locations: Krishna

  • కనికరించేనా.. కనుమరుగయ్యేనా..!

    కృష్ణా: ప్రతి శుక్రవారం పెడనలో జరిగే వారపు సంతకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే మత్స్యకారులు, ఇతర వర్తకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి సదుపాయం లేక స్థానిక బస్టాండ్‌లోనే రోజు గడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.17లక్షలను మార్కెట్ మార్కెట్ ఆధునికరణకు కేటాయించినప్పటికీ..నేటికీ అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడంతో సంత కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

     

     

  • ప్రతి గురువు దైవంతో సమానం: తంగిరాల

    ఎన్టీఆర్: ఉపాధ్యాయులందరికీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ.. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమన్నారు. తల్లిదండ్రులు తర్వాత గురువును పూజిస్తామన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.

     

  • ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: MLA మండలి

    కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ రెండవ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామన్నారు.

  • నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’

    ఎన్టీఆర్ జిల్లాలో నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరా, సమస్యలపై
    9154970454 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 10.30గంటల కార్యక్రమం జరుగుతుందన్నారు. రైతులతో పాటు డీలర్లు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు.. ఇలా ఎవ రైనా డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా మాట్లాడవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.

  • నేడు పీవీన్ మాధవ్ పర్యటన వివరాలు

    ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ‘సారధ్యం’ యాత్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పిస్తారు. కేబీఎన్ కాలేజీ నెహ్రూబొమ్మ సెంటర్‌వద్ద ఉదయం 10.15 గంటలకు శోభాయాత్రలో పాల్గొంటారు. 11.15 గంటలకు విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు సితారసెంటర్, ఎన్.కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవసభలో పాల్గొననున్నట్లు సమాచారం.

     

  • విజయవాడకు చేరిన మాధవ్ ‘సారథ్యం‘

    ఎన్టీఆర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ‘సారథ్యం’యాత్ర విజయవాడకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆయన ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. ఉదయం 10గంటలకు నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాధవ్ నివాళులర్పించనున్నారు. 10.15గంటలకు శోభాయాత్రలో పాల్గొననున్నారు. 11.15గంటలకు పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం, సాయంత్రం 4గంటలకు సితార సెంటర్‌లోని ఎన్.కన్వెన్షన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ సభలో పాల్గొననున్నట్లు అధికారులు మాధవ్ షెడ్యూల్‌ను వెల్లడించారు.

  • బిల్ కలెక్టర్‌పై దాడి.. డబ్బలు చెల్లించాలంటూ..!

    కృష్ణా: నాగాయలంకలో బిల్ కలెక్టర్ వెంకటేష్‌పై టీడీపీ నేత మండవ బాలవర్ధినరావు, తోట శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డారు. అప్పు తీసుకుని, వడ్డీతో పాటు అసలు చెల్లించినా, మళ్లీ డబ్బులు కావాలని బెదిరించి, తనపై దాడి చేసినట్లు వెంకటేష్ వాపోయారు. బాధితుడిని అతని సోదరుడు, తండ్రి రక్షించి అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

     

  • ఏ వంతెన కావాలో ఓటేయండి!

    AP : కృష్ణా నదిపై రాజధాని నుంచి విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారికి అనుసంధానించేందుకు ప్రభుత్వం ఐకానిక్‌ వంతెనను నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు నాలుగు డిజైన్లను ఎంపిక చేసింది. ఆధునిక ఇంజినీరింగ్‌ శైలిలో కూచిపూడి కళను మేళవించి అమరావతిని గుర్తుకు తెచ్చేలా వీటిని రూపొందించారు. ఎంపిక కోసం ఆయా డిజైన్లను CRDA వెబ్‌సైట్‌లో ఓటింగ్‌కు పెట్టారు.

     

  • గణనాథుడి ఆశీస్సులు పొందిన తంగిరాల

    ఎన్టీఆర్: చందర్లపాడు మండలం తుర్లపాడులో ఏర్పాటు చేసిన వినాయకుడిని గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దర్శించికున్నారు. గణనాథుడికి ఏర్పాటు చేసిన విశేష పూజలలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

  • భారీ ధర పలికిన వినాయకుడి లడ్డు..!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విఘ్నేశ్వరుడి 11 కేజీల లడ్డు వేలం పాట నిర్వహించారు. మాదాని కుమార్ రూ.23,400లకు దక్కించుకున్నారు. నిమజ్జన నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు పాల్గొన్నారు. వినాయకుడి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించారు.