ఎన్టీఆర్: విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడిగా రాయల సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్టీఆర్: విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడిగా రాయల సుబ్బారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.
కృష్ణా: హైవేపై వాహనదారులు ఖచ్చితంగా వేగ నియంత్రణ పాటించాలని అవనిగడ్డ సీఐ యువకుమార్ స్పష్టం చేశారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో మోపిదేవి మలుపు, పెనుమూడి వారధివైపు వేగ నియంత్రణకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డ్రమ్ములు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై లారీలు, కంటైనర్లు, కార్లు, బైక్‌లు మితిమీరిన వేగంతో వెళ్లకుండా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: గుడివాడ టూటౌన్ సీఐగా హనీష్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిగా సీఐగా పనిచేసిన చిన్ని నాగప్రసాద్‌ను ఏలూరు రేంజ్ వీఆర్‌కు తరలించారు. విజయవాడ కంట్రోల్ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న హనీష్ గుడివాడకు బదిలీపై వచ్చారు.
కృష్ణా: కళలను పోషించిన మహారాజులే ప్రజల హృదయాల్లో స్థానం పొందారని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన ప్రముఖ రచయిత పూర్ణచందు రచన ‘భువనవిజయం- రాయలనాటి కథలు, గాథలు’ గ్రంథావిష్కరణ సభలో ఆయన పాల్గొని కళాకారులను ప్రోత్సహించడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని, చరిత్ర భావితరాలకు మారదర్శిగా ఉండాలన్నారు.
కృష్ణా: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. అసెంబ్లీలో జర్నలిస్టుల సమస్యలను యార్లగడ్డ ప్రస్తావించడంతో రాష్ట్ర క్యాబినెట్ ఇళ్ల స్థలాల కేటాయింపునకు తీర్మానించి, మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో శనివారం ఏపీయుడబ్ల్యూజే ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో యార్లగడ్డకు శాలువా,పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు.
కృష్ణా: పెడన నియోజకవర్గంలో టీడీపీ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గూడూరు మండలంలోని కప్పలదొడ్డిలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని తెలిపారు.
కృష్ణా: పెడన నియోజకవర్గంలో గుర్రపు డెక్క సమస్య తీవ్రంగా ఉంది. పంట కాలువలు నిండిపోవడంతో వెయ్యి ఎకరాల్లో వరి ఎదలు ఎండిపోతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీటి సంఘాలు ఏర్పాటు చేయకపోవడంపై కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: గుడివాడలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 10మందికి జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఫైన్ వేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
కృష్ణా: కానూరులో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సాయిబాబా గుడి దగ్గర నుంచి వేలాది భక్తుల నడుమ జగన్నాథుని యాత్ర ప్రారంభమైంది. జగన్నాథుని ఆశీస్సుల కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.