ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు వినియోగం పట్ల కలిగేటువంటి నష్టాలపై ఎక్సైజ్ సీఐ అశ్ర పున్నిషా బేగం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలు ఉపయోగ వలన అనారోగ్యం పాలవుతారని, వీటి వినియోగం పట్ల ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిదని ఆమె అన్నారు. విద్యార్థులు చదువులకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు.
Locations: Krishna
-
‘విద్యార్థులు చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి’
-
మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన
ఎన్టీఆర్: నందిగామలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలిపారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వయోపరిమితి 62ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.
-
వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని
AP : YCP కీలక నేత వల్లభనేని వంశీ ఇంటికి మాజీ మంత్రులు పేర్ని నాని , కొడాలి నాని వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, YCPనేతలపై అక్రమ కేసులు తదితర విషయాలపై వారు చర్చించారు. వల్లభనేని వంశీతో పాటు, అన్ని కేసుల్లో అరెస్ట్ ఆయిన అనుచరులను కూడా కొడాలి నాని పలుకరించి బాగోగులు తెలుసుకున్నారు.
-
ప్రేమ వివాహం.. కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు!
ఏలూరు: కైకలూరు మండలంలో ఓ ప్రేమజంట వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. చటాకాయ గ్రామానికి చెందిన రోజా కుమార్, నత్తగుళ్లపాడు గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న శుక్రవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిని వారిని కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
-
‘పేదరికం లేని సమాజమే లక్ష్యం’
కృష్ణా: పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సీఎం చంద్రబాబు పీ4ను అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.. నియోజకవర్గంలో P-4 అమలుపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలకు ప్రయోజనం చేకూరే ప్రాజెక్టుల రూపకల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమష్టిగా P-4 లక్ష్య సాధనకు కృషి చేయాలని వెనిగండ్ల సూచించారు.
-
సాగునీటి కోసం రైతుల ఆవేదన!
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలో రైతులు ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. క్వారీలు, క్రషర్ల వల్ల పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినా ఫలితం లేదని వాపోతున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
-
తీర గ్రామాల దాహం తీరుస్తున్న MLA మండలి
కృష్ణా: కోడూరు మండలం పాదాలవారిపాలెం, పాలకాయతిప్ప గ్రామాలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో మండలి ఫౌండేషన్ ద్వారా 20వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్‌తో త్రాగునీరు సరఫరా చేశారు. స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జ్ఞాపకార్థం ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్ పర్యవేక్షించారు. గ్రామాల దాహాన్ని తీర్చేందుకు చొరవ తీసుకుంటున్నారు.
-
పేదలకు సంక్షేమం అందించడమే లక్ష్యం: MLA
కృష్ణా: పెడన నియోజకవర్గంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పెడన నియోజకవర్గ పరిశీలకులు గొట్టిముక్కల రఘురామరాజుతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పేదలకు సంక్షేమం అందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
-
వైభవంగా లక్ష్మీనారాయణస్వామి పవిత్రోత్సవాలు
కృష్ణా: అవనిగడ్డలోని ప్రాచీన దేవస్థానం శ్రీభూనీళా రాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు పోతరాజు భాస్కరరావు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఈఓ యార్లగడ్డ శ్రీనివాసు పర్యవేక్షణలో ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
-
‘ప్రజల వద్దకే పాలన దిశగా సుపరిపాలనలో తొలి అడుగు’
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరగింది. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, చల్లపల్లి మండల టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.