ఎన్టీఆర్: వీరులపాడు మండలం చౌటపల్లి, చట్టన్నవరంలో కంది పంట సాగు చేసిన రైతులు మద్దతు ధర రూ.7550కు కొనుగోలు కాక బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతుల సమస్యను మార్క్‌ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కందుల కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Locations: Krishna
-
పడమట PSకు వల్లభనేని వంశీ
ఎన్టీఆర్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పడమట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల కావడంతో, ఆయన పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ వద్ద పలువురు కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు.
-
జగ్గయ్యపేటలో ఆర్టీసీ కార్మికుల ధర్నా ఉధృతం
ఎన్టీఆర్: ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగ్గయ్యపేట డిపోలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నినదించారు.
-
తృటిలో ప్రమాదం.. బస్సుకు అడ్డుగా నిలబడి..
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో పెను ప్రమాదం తప్పింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలో శనివారం KCP కంపెనీ బస్సు సిబ్బంది తెగింపుతో పిల్లలను రక్షించారు. చైతన్య స్కూల్ బస్సు ఫెయిల్ కావడంతో పిల్లలపైకి దూసుకొస్తుండగా, KCP సిబ్బంది అడ్డుగా నిలబడి ఆపారు. KCP సిబ్బందిని స్థానికులు అభినందించగా, చైతన్య బస్సు డ్రైవర్ తీరును తప్పుబట్టారు. బస్సును స్థానికులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
-
ఆత్మహత్యకు పాల్పడిన ఆదిత్య ఫార్మసీ ఎండీ
AP: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడ అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకుగల కారణాలపై ఆరా తీస్తున్నారు.
-
ఈ నెల 8 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు
AP : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 8 నుంచి శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు దుర్గమ్మ కూరగాయలు, పండ్లు రూపంలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి ఆషాడ మాసం సారెను భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్నారని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ నెల 10న పూర్ణాహుతితో శాకాంబరీ దేవి ఉత్సవాలు ముగియనున్నాయి.
-
కూలీలకు పూర్తి వేతనం అందాలి: కలెక్టర్
ఎన్టీఆర్: నందిగామ మండలం సోమవరంలో కలెక్టర్ లక్ష్మీశ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలకు పూర్తి వేతనం అందేలా పనులు చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తక్కువ ఖర్చుతో నిర్మించే మ్యాజిక్ డ్రైయిన్‌ను అన్ని పంచాయతీల్లో నిర్మించేలా కృషి చేస్తామన్నారు. గ్రామంలో మిగిలిన రోడ్లకు ఈ డ్రైన్ నిర్మించాలని సూచించారు.
-
సమ్మెకు పిలుపునిచ్చిన హరినాథ్
ఎన్టీఆర్: ఈనెల 9వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాథ్ విస్సన్నపేటలో ప్రచారం నిర్వహించారు. సుప్రీంకోర్టు నిర్ణయించిన ప్రకారం కనీస వేతనం రూ.36వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు.
-
ఫార్మసీ కంపెనీ ఎండీ సూసైడ్.. అదే కారణమా?
ఎన్టీఆర్: విజయవాడ అయోధ్య నగర్‌లోని క్షత్రియ భవన్‌లో శనివారం ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
-
మోపిదేవిలో హైకోర్ట్ జడ్జ్ పూజలు.. కుటుంబ సమేతంగా..!
కృష్ణా: మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్ట్ జడ్జి కె.శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జడ్జ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు శేష వస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.