Locations: Krishna

  • సమ్మెకు కార్మికుల సంసిద్ధత

    ఎన్టీఆర్: దేశవ్యాప్తంగా ఈనెల 9వ తేదీన తారీఖు జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ విస్సన్నపేట బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్మిక సంక్షేమాన్ని నిలుపుదల చేసే ప్రభుత్వాల ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ బోర్డును ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

     

     

  • ప్రజల తరఫున BJP.. ఆక్రమణలపై ఫిర్యాదు

    కృష్ణా: అవనిగడ్డలో రోడ్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధానంగా చిరు వ్యాపాలరులు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల పక్కన ఉన్న మాంసం దుకాణాలు వ్యర్థాలను కాలువలో పారేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరుతూ ప్రజల తరఫున బీజేపీ నేతలు పట్టణ ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం అందించారు.

  • CPI సంతాపం

    ఎన్టీఆర్: విస్సన్నపేట సీపీఎం పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం తల్లి సుశీల(84) మృతదేహానికి శనివారం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల నాగేంద్రప్రసాద్ నివాళులర్పించారు. జ్ఞానరత్నానికి, వారి కుటుంబసభ్యులను తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నాగరాజు, విసన్నపేట మాజీ సర్పంచ్  లక్ష్మయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.

  • VIDEO: గుడివాడ PSకు కొడాలి నాని

    కృష్ణా: మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఓ కేసులో ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు స్టేషన్‌లో నాని సంతకం చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

     

  • ఎమ్మెల్యే కుటుంబసభ్యులే అక్రమార్కులు : వైసీపీ

    కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడిలో అక్రమ మట్టి తవ్వకాలకు మూల కారకులు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులే అని వైసీపీ నేత గౌతమ్ ఆరోపించారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపులు జరుగుతున్నా పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

     

  • ప్రజాసంక్షేమం కోసం సేవలందించడం ప్రశంసనీయం: MLA

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నేడు మంచినీటి ట్యాంకర్ ప్రారంభించారు. ట్యాంకర్‌ను గ్రామానికి చెందిన వంక రాములు జ్ఞాపకార్ధంగా, వారి కుమారుడు వంక ఏసుబాబు గ్రామ ప్రజల ఉపయోగార్థం బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అత్యంత ప్రశంసనీయమైనవి’ అని ఏసుబాబును అభినందించారు.

     

  • మెప్మా ఆర్పీలకు సంబరం.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఎన్టీఆర్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్‌లకు సంబంధించి మూడేళ్ల కాల పరిమితి నిబంధన తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆర్పీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యను ఆర్పీలు కలిసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారంత కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

     

  • మచిలీపట్నంలో మంత్రి కొల్లు..!

    కృష్ణా: రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నేడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు స్థానిక నిజాంపేటలోని శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ప్రారంభం కానున్న జగన్నాథ స్వామి రథోత్సవంలో ఆయన పాల్గొంటారని మంత్రి కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. సాయంత్రం 5గంటలకు 12వ డివిజన్ ఆశీర్వాదపురంలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమానికి హాజరవుతారన్నారు.

  • ‘కొబ్బరి’కి మంచి రోజులొచ్చాయ్

    ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు కొబ్బరికి పెట్టింది పేరు. ఈనాలుగు జిల్లాల్లో సుమారు 3.5లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా. ఇటీవల రికార్డుస్థాయిలో కొబ్బరి ధర పెరగడంతో దీని అనుబంధ పరిశ్రమలు, సిబ్బందికి లాభాలు తెచ్చిపెడుతోంది. రైతు వద్దే కాయకు రూ.8 నుంచి రూ.10వరకు చెల్లించి వ్యాపారులు తీసుకెళ్తున్నారు. కేరళ, తమిళనాడులో దిగుబడి తగ్గడంతో ఏపీ నుంచి ఎగుమతులు పెరిగాయని రైతులు చెబుతున్నారు.

  • అదానితో ఒప్పందం రద్దు చేయాలి: CPI

    ఎన్టీఆర్: విస్సన్నపేటలో సీపీఐ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి త్యాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిన గృహ అవసరాలకు స్మార్ట్ మీటర్లను బిగించకుండా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వారు కోరారు. అనంతరం విద్యుత్ ఏఈకి వినతిపత్రం అందజేశారు.