Locations: Krishna

  • బడి బాట మరిచిన బాల్యం..!

    ఎన్టీఆర్: కొందరు పిల్లలు బడిబాట మరిచారు. విస్సన్నపేటలో ఓ విచారకర దృశ్యం కంటపడింది. జంగాల సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి, తన కుమారుడితో కలిసి భిక్షాటన చేస్తూ కనిపించాడు. ఎందుకని మైనర్ బాలుడితో భిక్షాటన చేస్తున్నావని అడిగితే.. ఇది తమ సంప్రదాయమని సమాధానమిచ్చాడటా. మైనర్ బాలల జీవితాలు నాశనమవుతున్నాయని, పిల్లలు బడిబాట పట్టేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

     

  • అమెరికాలో పుస్తకావిష్కరణ.. అస్సలు ఊహించలేదు: బాలకోటయ్య

    ఎన్టీఆర్: ‘నేను-నా అమరావతి’ పుస్తకావిష్కరణతో తన జన్మ ధన్యమైందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య భావోద్వేగంతో ప్రసంగించారు.  అమెరికాలోని తానా సభల్లో ఆయన రాసిన ‘నేను-నా అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ.. ‘ప్రజా రాజధాని అమరావతి నాకు ఇచ్చిన గొప్ప వరమిది. నా జీవన ప్రయాణంలో నేను రాసిన పుస్తకాన్ని అమెరికాలో ఆవిష్కరిస్తానని ఏనాడూ ఊహించలేదు’ అన్నారు.

  • రూ.48లక్షలతో గుండేరు కట్టల అభివృద్ధికి శ్రీకారం

    కృష్ణా: గుండేరు కట్టల అభివృద్ధి పనులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఘంటసాల మండల పరిధిలోని బిరుదుగడ్డ నుంచి దాలిపర్రు వరకు ఉన్న గుండేరు మేజర్ డ్రైనేజీ కట్టల బలోపేతం, పూడికతీత పనులను రూ.48లక్షలతో 3.2 కిలోమీటర్లు మేర అభివృద్ధి పరచనున్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు చౌదరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

  • గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ.. 9న ఎగ్జామ్

    ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5-9తరగతుల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఈనెల 9న మోపిదేవి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె.వీరరవి తెలిపారు. మోపిదేవి, మైలవరం కొండపల్లి(బాలురు), జగ్గయ్యపేట వత్సవాయి(బాలురు), మచిలీపట్నం(బాలికలు)లో ఇంగ్లిష్ మీడియంలో సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు 8వ తేదీలోగా ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  • ఉచిత వైద్య సేవలు.. రెండు రోజులు

    కృష్ణా: గుడ్లవల్లేరులో నేడు, రేపు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఎముకలు, కీళ్లు, నడుము, షుగర్, థైరాయిడ్, సాధారణ వైద్య సేవలందించనున్నట్లు నిర్వాహకులు తెలిపార. మందులు కూడా పంపిపీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

     

  • ఆ కార్డుల రెన్యువల్ తప్పనిసరి!

    కృష్ణా: కౌలు రైతులు తమ గుర్తింపు కార్డులను వీఆర్వోల ద్వారా రెన్యువల్ చేసుకోవాలని పెడన ఏవో సజ్జా జెన్నీ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే కొత్తగా దరఖాస్తులు చేసుకునే రైతులు రెవెన్యూ శాఖ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. తగిన పత్రాలను వీఆర్వోలకు అందజేస్తే కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరవుతాయన్నారు.

  • తాగడానికి డబ్బులు ఇవ్వలేదని..

    కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి భార్యను వేధించాడు. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ అని చూడకుండా రోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు. బాధితురాలు మొక్కజొన్న ఖండేలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. పోలీసులు అతడిని అడ్డుకోవడంతో వారిపైనే తిరగబడ్డారు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • ‘లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి’

    కృష్ణా: జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి సాధన చేసి అక్కడికి చేరుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ పిల్లలకు ఉద్బోధించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో PM కేర్ పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి గుర్తించిన పిల్లలతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

  • అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

    కృష్ణా: జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో శుద్ధ నీటి సరఫరాకు శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

  • ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కేవలం రూ.3వేలతో టూర్!

    కృష్ణా: అవనిగడ్డ డిపో నుంచి ప్రతి నెలా అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, విష్ణుకంచి, శివకంచి, కామాక్షమ్మ గుడి, తిరుత్తణి దర్శనం కోసం సూపర్ లగ్జరీ బస్సు రూ.3000 ఛార్జీతో నడుస్తుందని డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. ఈనెల 9న సాయంత్రం 5గంటలకు రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా బయలుదేరుతుంది. సీటు రిజర్వేషన్ కోసం 7036335079, 9959225466 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.