Locations: Krishna

  • ‘విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం’

    ఎన్టీఆర్: రాష్ట్రంలో విద్యావిధానాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైసీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ విమర్శించారు. తిరువూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించడం తగదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

  • ‘ప్రతి లబ్దిదారులకు చేర్చే బాధ్యత మీదే’

    కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం రూ.5.5లక్షల వ్యయంతో మంజూరు చేసిన ట్యాబ్‌లను పెడన పట్టణంలోని 22మంది రిసోర్స్ పర్సన్స్‌(RP)లకు శుక్రవారం టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ట్యాబ్‌లను అందజేశారు. ఈ ట్యాబ్‌లు డేటా సేకరణ, ఫీల్డ్ మానిటరింగ్, మహిళా సంఘాల సమాచార నిర్వహణలో ఉపయోగపడతాయని, ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు చేరేలా RPలు బాధ్యత వహించాలని ఎమ్మెల్యే తెలిపారు.

     

  • పింగళి వెంకయ్య సేవలు శ్లాఘనీయమం: కొనకళ్ల

    కృష్ణా: మచిలీపట్నం మాజీ ఎంపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య సేవలు శ్లాఘనీయమని అన్నారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, వెంకయ్య దేశభక్తిని వివరించారు. ప్రతిఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

  • మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

    కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ..మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

  • రోశయ్య.. రాజకీయ నైతికతకు నిలువెత్తు నిదర్శనం: MLA

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), శ్రీరాం చిన్నబాబు రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోశయ్య రాజకీయ నైతికతకు, సరళతకు, ప్రజా పాలనలో వినయశీలతకు నిలువెత్తు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ఆయన విధానాలు, ప్రజానురాగం ప్రతి ప్రజాప్రతినిధికి ప్రేరణ అని పేర్కొన్నారు.

  • హుస్సేని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మౌన పాదయాత్ర

    కృష్ణా: మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా, హుస్సేని స్టూడెంట్స్ ఫెడరేషన్ మచిలీపట్నంలో మౌన పాదయాత్ర నిర్వహించింది. చింత చెట్టు సెంటర్ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు సాగిన ఈ యాత్ర అనంతరం, ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. మత గురువు మౌలానా మీర్జా రాహేద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొని మొహరం ప్రాముఖ్యతను వివరించారు.

  • ‘పోలీసుల క్రూరత్వాన్ని రంగా ప్రశ్నించారు’

    ఎన్టీఆర్: నందిగామ పట్టణం కాకాని నగర్‌లో  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో శుక్రవారం వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా కూటమి నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ..రంగా సామాజిక న్యాయంపై దృష్టి సారించారు, భూమిలేని వారికి భూ పంపిణీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించారు. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు.

  • ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: శ్రీరాం తాతయ్య

    ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా జగ్గయ్యపేట 22వ వార్డు మిట్టగూడెంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) “సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. వారు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ‘సూపర్ సిక్స్’ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

  • బడుగుల ఆశాజీవి వంగవీటి: సామినేని

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 78వ జయంతి ఘనంగా జరిగింది. జనసేన జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా ఒక కులానికో, ప్రాంతానికో కాదని, బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన అసమాన ప్రజానాయకుడు అని, ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఉదయభాను అన్నారు.

  • రోశయ్య.. నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరు: ఉదయభాను

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 92వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య విగ్రహానికి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ..రోశయ్య నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరు అని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.