ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి పంచాయతీలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమం మూడవరోజు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థులకు వివరిస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుబ్బారావు, వేణు గోపాల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
ప్రజల భాగస్వామ్యంతో పాలన
ఎన్టీఆర్: విస్సన్నపేటలో ప్రజల భాగస్వామ్యంతో పాలన సాగుతోంది. టీడీపీ నాయకులు వార్డు సభ్యులతో కలిసి పట్టణంలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు పరిచిన, అమలుకు సిద్ధంగా ఉన్న పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో మెరుగైన సేవలందించడే కూటమి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు నాగలక్ష్మి, వార్డు మెంబర్లు వెంకట్రావు, శివ బాజి తదితరులు పాల్గొన్నారు.
-
BREAKING: RTC బస్సు, లారీ ఢీ.. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. లారీ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్ని గుండంలో నడచిన 40 మంది(VIDEO)
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో పదకొండు రోజులు జరుగు పీర్ల సవ్వారీ సందడిలో 7వరోజున అగ్నిగుండంలో పీర్లను ఎత్తుకొని నిప్పులపై నడిచారు. 12 సంవత్సరాలు నిండిన చిన్నారుల నుండి పెళ్లి కాని యువకుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుండి కఠిక ఉపవాసం ఉండి నిష్టతో భక్తి శ్రద్దలతో పీర్లను ఎత్తుకొని భగభగ మండే నిప్పులపై గురువారం అర్ధరాత్రి నడిచారు. పీర్ల సందడిని ఘనంగా నిర్వహించారు.
-
జిల్లాస్థాయిలో గెలుపెవరిదో?
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగలూరు డైట్ కళాశాలలో ఈనెల 9వ తేదీన జిల్లాస్థాయి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని హైస్కూళ్లలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం, నివారణపై చిత్రలేఖనం, లింగ సమానత్వంపై వ్యాసరచన పోటీలు మండల స్థాయిల్లో నిర్వహించి, విజేతలను జిల్లాస్థాయి పోటీలకు పంపాలని సూచించారు.
-
కార్మికులను బెదిరించడం తగదు: CITU
ఎన్టీఆర్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులపై అధికారులు బెదిరింపులకు పాల్పడటం తగదని సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోర్కెల సాధనకు ఆందోళన చేపట్టిన కార్మికులపై బెదిరింపులకు పాల్పడటాన్ని నిరసిస్తూ తిరువూరు నగరపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం అనంతరం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు అన్నారు.
-
ఆయాపై దాడి చేసిన వారిని శిక్షించాలి: CITU
ఎన్టీఆర్: అంగన్‌వాడీ ఆయాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. విస్సన్నపేట మండలం రామానగరంలో అంగన్‌వాడీ ఆయాగా విధులు నిర్వహిస్తున్న నాగమణిని చిన్నోడు, ద్రాక్షావళి, కొమ్ము జీనత్ దుర్భాషలాడి, విచక్షణారహితంగా దాడి చేశారు. బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని అంగన్వాడి ఆయాకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ బాలగని వెంకటేశ్వరావు కోరారు.
-
‘మెగా PTM 2.O’.. అన్ని పాఠశాలల్లో పక్కాగా!
కృష్ణా: పెడనలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన ‘మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.O’(PTM) సమావేశం నిర్వహించనున్నట్లు ఎంఈఓ వైవీ హరినాథ్ తెలిపారు. ఇందులో భాగంగా 2047 నాటికి వికసిత ఏపీ లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు.
-
13మంది జడ్జ్‌లు.. 13బెంచిలతో జాతీయ లోక్ అదాలత్
ఎన్టీఆర్: విజయవాడ న్యాయస్థానాల సముదాయంలో ఈనెల 5వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎ.సత్యానంద్ తెలిపారు. ఉదయం 10.30గంటలకు అదాలత్ ప్రారంభమవుతుందన్నారు. సివిల్, రోడ్డు ప్రమాద కేసులు, ప్యామిలీ కోర్టు విషయాలు, వాణిజ్య వివాదాలు, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసులు, పెండింగ్లో ఉన్న కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను ఆదాలత్‌లో పరిష్కరిస్తారన్నారు. ఇందుకోసం 13 న్యాయమూర్తులతో 13 బెంచిలను ఏర్పాటు చేశామన్నారు.
-
గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ
AP: గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. బుధవారం విధులు ముగిసిన అనంతరం ఇక్కడి సిబ్బంది ఎప్పటిలాగే కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్లగా, గురువారం ఉదయం వచ్చేటప్పటికి కార్యాలయం ప్రధాన ద్వారం గడియ, బయటి గదిలోని బీరువా పగులగొట్టి కనిపించాయి. రూ.వంద విలువైన స్టాంపు పేపర్ల బండిల్‌తో పాటు సాధారణ స్టాంపులు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు వారు గుర్తించారు.