Locations: Krishna

  • కలప నిందితులు అరెస్ట్.. 14రోజులు రిమాండ్

    ఎన్టీఆర్: అక్రమంగా కలప నరికిన కేసులో నిందితులకు నందిగామ కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. కంచికచర్ల మండలం పరిటాల శివారులోని ఉమా హైలాండ్స్‌లోని కలపను పేరకలపాడు గ్రామ వైసీపీ అధ్యక్షుడు అక్రమంగా నరికాడు. అధ్యక్షుడుతో సహా 9మంది ముద్దాయిలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై బోన గిరి రాజు తెలిపారు. నిందితులను నందిగామ కోర్టులో హాజరుపరచగా..ముద్దాయిలకు నందిగామ కోర్టు 14జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై వెల్లడించారు.

     

  • విదేశీ గడ్డపై తెలుగు పుస్తకానికి అరుదైన గౌరవం

    ఎన్టీఆర్: చారిత్రాత్మక ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య రాసిన ‘నేను-నా అమరావతి’ పుస్తకాన్ని నేడు అమెరికాలోని మిచిగాన్‌లో జరగనున్న తానా సభల్లో ఆవిష్కరించనున్నారు. తెలుగు పుస్తకానికి విదేశీ గడ్డపై దక్కిన అరుదైన గౌరవం ఇదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల 1,631రోజుల ఉద్యమమే పుస్తకానికి స్ఫూర్తి అని బాలకోటయ్య తెలిపారు.

     

  • పెడన VROలకు దక్కిన గుర్తింపు!

    కృష్ణా: పెడన నియోజకవర్గంలో ఐదుగురు వీఆర్వోలకు పదోన్నతులు లభించాయి. రమ్య, పార్వతి, ఆంజనేయులు, మణికంఠ, బేబీ గ్రేడ్-2 నుండి గ్రేడ్-1కు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారిని ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ కూనపురెడ్డి అనిల్ కుమార్ ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు.

  • అమరావతి ORR వెడల్పు.. 140 మీటర్లు

    AP : అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డును 140మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జెండా ఊపింది. గతంలో 70మీటర్ల వెడల్పుతో 189కి.మీ. ORR నిర్మాణానికి అంగీకారం తెలపగా, ఇది సరిపోదంటూ CM చంద్రబాబు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు.  ORRపై 50ఏళ్లలో పెరిగే వాహనరద్దీని దృష్టిలో పెట్టుకొని 150మీటర్ల వెడల్పుతో ORR ఉండాలని చంద్రబాబు పట్టుబట్టారు. దీంతో 140మీటర్ల వెడల్పునకు కేంద్రం సమ్మతించింది.

  • పేకాట స్థావరంపై డ్రోన్ పోలీసింగ్ దాడి.. 23 మంది అరెస్ట్

    ఎన్టీఆర్: తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లెల గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా పెట్టి, దాడి చేశారు. 23 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.93,470 నగదు, 4 కార్లు సీజ్ చేశారు.

  • ‘విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలి’

    ఎన్టీఆర్: విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలని లీగల్ డ్రగ్స్ ఐజీపీ ఆర్‌కే రవికృష్ణ అన్నారు. గురువారం విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ విక్రయించిన రవాణా చేసిన టోల్ ఫ్రీ 1972 కాల్ చేసి సమాచారం చెప్పాలని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ సరిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • ‘ఆ దిశగా జిల్లాలో ప్రణాళికలు’

    కృష్ణా: స్వర్ణాంధ్ర-2047 సాధించే దిశగా జిల్లాలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో P4 తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే బాలాజీ నగరంలోని కలెక్టరేట్ నుంచి పాల్గొని జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు గురించి వివరించారు.

  • చిన్న పులిపాక మరో ఉద్దానంగా మారనుందా.?

    కృష్ణా: బక్కెట్లో ఉన్నది పానకం అనుకుంటే పొరపాటే. తోట్లవల్లూరు మండలం చిన్న పులిపాక గ్రామంలో మంచినీటి కుళాయిల నుంచి వచ్చే నీరు. గత 5నెలలుగా ఇదే పరిస్థితి. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఉపయోగం లేదని స్థానికులు వాపోయారు. ఈనీరు తాగితే చిన్న పులిపాక.. మరో ఉద్దానంగా మారుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

  • పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరీ..!

    కృష్ణా: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బదులుగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో వెట్టిచాకిరీ పనులు చేయిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా పెడన పల్లోటి పాఠశాలలో చిన్నారులతో పాఠశాల పుస్తకాలను మొయిస్తూ పనిచేయించడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవాల్సిన వయసులో బాలబాలికలను ఇలా కూలీలుగా మలచడాన్ని తల్లిదండ్రులు, విద్యావంతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంత త్వరగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

  • ఉత్తరాంద్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష

    ఎన్టీఆర్: విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంద్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.