Locations: Krishna

  • ఇంటింటికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

    కృష్ణా: రాష్ట్ర టీడీపీ పిలుపుమేరకు పెడన రూరల్ మండలం కూడురు గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటిని సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి స్థానిక ప్రజలకు వివరించారు.

     

  • NTR హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

    ఎన్టీఆర్: విజయవాడలోని NTR హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీ ఎదుట ఫారెన్ మెడికల్ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. తమకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ గేటు వద్ద ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ కారుని అడ్డుకుని నిరసన తెలియజేశారు. దీంతో వైద్య విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

  • ‘కోర్టుదాకా ఎందుకు… కూర్చుని మాట్లాడుకోండి’

    ఎన్టీఆర్: కోర్టు, పోలీసుల సమన్వయంతో ఈనెల 5వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలత్‌ను విజయవంతం చేద్దామని నందిగామ అదనపు 16వ జిల్లా, సెషన్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం పోలీసులతో లోక్‌అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి స్టేషనలవారీగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరాతీశారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోయిన ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి వారితో మాట్లాడి పరిష్కారానికి మార్గం చూపాలన్నారు.

  • ‘చెత్త నుంచి సంపద సృష్టికి చిత్తశుద్ధితో ప‌నిచేయండి’

    ఎన్టీఆర్: చెత్త శుద్ధితో సంప‌ద సృష్టికి చిత్తశుద్ధితో ప‌నిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. గురువారం కంచిక‌చ‌ర్ల‌లో ఎస్‌డ‌బ్ల్యూపీసీ షెడ్‌ను ఆయన ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, కేంద్రం కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు.  స్వచ్ఛ భారత్ లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యర్థాలను వేరు చేసి, వాటిని సంపదగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

     

  • ‘ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా’

    గుంటూరు: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఆ రోడ్డు దుస్థితి మారేది ఎప్పుడు సారూ..

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గండేపల్లిలో సెంటినీ బేవరేజెస్ కంపెనీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గురువారం ఆసుపత్రిని ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కీసర నుంచి గండేపల్లి రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉందని సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మందడపు రామకృష్ణ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

  • ‘జగ్గయ్యపేట అభివృద్ధికి ప్రణాళికలు’

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఆదాయం పెంచే మార్గాలపై సమీక్షించారు. వ్యవసాయం, విద్య, వైద్యం వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

  • డ్రగ్స్ రవాణాపై విస్తృత తనిఖీలు

    ఎన్టీఆర్: ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాలకు కొరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని సీజ్ చేశారు.

  • తిరుపతమ్మ ఆలయానికి విరాళాలు

    ఎన్టీఆర్: విజయవాడలోని విజయనగ్ కాలనీ గుణదలకు చెందిన రావూరి సుబ్బారావు, అల్లూరమ్మ దంపతులు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన పథకానికి రూ.50,000, గోసంరక్షణకు రూ.50,000 విరాళమిచ్చారు. ఆలయ అధికారి బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్ సూచనల మేరకు ఏఈవో జంగం శ్రీనివాసరావుకు అందజేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను ఆలయ ఇన్స్పెక్టర్లు నరసయ్య, కృష్ణమోహన్ అందజేశారు.

     

  • గన్నవరం పీఎస్‌కు వల్లభనేని వంశీ

    కృష్ణా: గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు. అక్రమ మైనింగ్, పార్క్‌లైట్ వద్ద టీడీపీ నాయకుడు రంగబాబు పై దాడి ఘటన, సీతామాలక్ష్మి స్థల వివాదం కేసుల్లో షూరిటీలు సమర్పించారు. కాగా 11 కేసుల్లో 140 రోజుల పాటు ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు. నిన్న బెయిల్‌పై విడుదలయ్యారు. గురువారం పోలీస్ స్టేషన్ వద్దకు వంశీ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.