Locations: Krishna

  • ‘జాతీయ రహదార్ల అభివృద్ధితో పోర్టుల అనుసంధానం’

    కృష్ణా: కేంద్ర ప్రభుత్వ సహకారంతో మచిలీపట్నం పోర్టులో మౌలిక వసతులు కల్పిస్తామని, పూర్తి సామర్థ్యం గల పోర్టుగా తీర్చిదిద్దుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సారథ్యం శోభాయాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన మాధవ్, బందరు పోర్టును ఇతర పోర్టులు, ముఖ్య నగరాలతో అనుసంధానం చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తామని అన్నారు.

  • అలా వచ్చే దొంగ స్వాములను నమ్మవద్దు..!

    కృష్ణా: బిచ్చగాళ్ల వేషధారణలో భిక్షాటనకు వచ్చే దొంగ స్వాములను ప్రజలు నమ్మవద్దని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. కోడూరు మండలంలో స్వాముల వేషధారణలో కొందరు భిక్షాటనకు వచ్చి అమ్మవారికి పూజ చేస్తానని ప్రజలను నమ్మించి వారి దగ్గర నగదు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మూఢనమ్మకాలతో దొంగస్వాములను నమ్మి ప్రజలు మోసపోరాదని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.

  • గొట్టుముక్కలలో ఘనంగా వినాయకుని నిమజ్జనం

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సొసైటీ ఆలయ ఆవరణలో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అందంగా అలంకరించిన ట్రాక్టర్‌పై విద్యుత్ లైటింగ్, డీజే మేళతాళాలు, బాణాసంచాతో గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. కోలాటం, భక్తి పాటలతో భక్తులు ఆకర్షితులయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా, గొడవలు లేకుండా నిమజ్జనం జరిగింది.

  • గ‌ణ‌ప‌తికి కేశినేని వెంక‌ట్ ప్ర‌త్యేక పూజ‌లు

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వెంకట్‌ను ఘనంగా సత్కరించారు. 43వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసినందుకు, వినాయకుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన నిర్వాహకులను అభినందించారు.

     

  • ‘యూరియా సరఫరాలో అవకతవకలు జరగకూడదు’

    కృష్ణా: గూడూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని కలెక్టర్ డీకే బాలాజీ అకస్మాకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో సమావేశమై యూరియా సరఫరా విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవతావకాలు జరగకూడదని ఏ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు.

  • ఘనంగా ట్రాక్టర్‌లతో రైతన్నల ర్యాలీ

    కృష్ణా: కోనేరు నుంచి జిల్లా పరిషత్ వరకు జరిగిన శోభాయాత్రలో ట్రాక్టర్‌లతో రైతన్నల ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్ హాజరయ్యారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో గణనాథుని అలంకరణ

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో వాసవి మార్కెట్ ఆధ్వర్యంలో జరుగుతున్న 43వ వార్షిక గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల ప్రధాన ఆకర్షణగా గణనాథుడిని రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, స్థానిక నేతలతో కలిసి గణనాథుని దర్శించుకున్నారు. ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

     

     

  • 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

    ఎన్టీఆర్: సెప్టెంబరు 22 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడలోని జమ్మిదొడ్డి వద్ద దసరా కో ఆర్డినేషన్ సమావేశంతో ఆనంతోపాటు సీపీ రాజశేఖర్ బాబు, ఈవో శీనానాయక్, దుర్గగుడి అధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ..11రోజులు 11అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తామని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

     

  • జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు: కలెక్టర్

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం గౌరవరం సొసైటీలో రైతులకు యూరియా సరఫరా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం 3000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

     

  • ‘ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శం’

    ఎన్టీఆర్: కంచికచర్ల ఓసి క్లబ్‌లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా పాల్గొని, ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల స్థానం గౌరవనీయం అని ఆమె అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవిస్తామని, అందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.