Locations: Krishna

  • సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు.. జర జాగ్రత్త!

    కృష్ణా: సైబర్ మోసగాళ్ల కొత్తగా మాయ మాటలు చెప్తే నమ్మి మోసపోవద్దు అని అవనిగడ్డ పోలీసులు తెలిపారు. పోలీసులమని చెప్పి డబ్బులు అడుగుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే నమ్మకండని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత కాల్స్ గురించి జాగ్రత్త వహించాలని సూచించారు.

  • ‘ప్రజల స్పందన అద్భుతం‘

    కృష్ణా: కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమనికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గూడూరు మండలం తరకటూరు గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన అద్భుతంగా ఉందని ఆయన అన్నారు.

     

     

  • 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయం: ఎంపీ

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. మోడల్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల్ని ఎంపీ తెలుసుకున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయమని ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అన్ని ప్రజలకు అందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు.

  • ‘రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట’

    కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో రూ.3.16 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర తారు రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

  • పథకం ప్రకారమే హత్య..!

    ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలంలో సంచలనం సృష్టించిన కొత్త రేపూడి తండా హత్య కేసును పోలీసులు ఛేదించారు. తిరువూరు సీఐ కార్యాలయంలో మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని తేల్చారు. పథకం ప్రకారం హత్య చేసిన బత్తుల కుమారి, అధూరి చర్లిస్‌లను అరెస్ట్ చేశామని తెలిపారు.

  • ’30 రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే.. కోర్టుకు వెళతాను’

    కృష్ణా: న్యాయవాది బడే శేషగిరి కనపర్తి శ్రీనివాసరావుకు పరువు నష్టం నోటీసు పంపారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కనపర్తి తన కుటుంబాన్ని సామాజికంగా, పరువు తగ్గేలా చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆయన అన్నారు. క్షమాపణ కోరితే సమస్య పరిష్కారం అవుతుందని, కాని కనపర్తి స్పందించలేదన్నారు. రూ.కోటి నష్టపరిహారం కోరుతూ నోటీసు పంపారు. 30 రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు వెళతానని బడే తెలిపారు.

  • శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలు నూజివీడులోనే..

    ఏలూరు: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు పీయూసీ తరగతులు కొనసాగుతాయని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లో భవనాలు, ఇతర సౌకర్యాలు నిర్మాణంలో ఉన్నందున, తాత్కాలికంగా నూజివీడులోనే తరగతులు నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు.
  • 20లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణం మోడల్ కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఏడాది కాలంలో సీఎం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారని వెల్లడించారు. రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.

  • ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో పాల్గొన్న ఎమ్మెల్యే

    కృష్ణా: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్బంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమనికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గూడూరు మండలం తరకటూరులో గడప గడపకు తిరిగారు. ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

  • ప్రతి హామీ నెరవేరుస్తాం.. MLA హామీ!

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ‘సూపర్ సిక్స్’ పథకాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. త్వరలో నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.