Locations: Krishna

  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ

    కృష్ణా: గన్నవరంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీ జరిగిందని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. కార్యాలయంలోని బీరువా పగలగొట్టి, విలువైన డాక్యుమెంట్లు, స్టాంపులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై సబ్ రిజిస్ట్రార్  గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

     

  • కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు.. ఆగేదెలా?

    కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడిలో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గురువారం ఉదయం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్నారు. ఈ మేరకు రెవిన్యూ, పోలీస్ అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తవ్వకాలను నిలుపుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.

  • కంచికచర్లలో 2వ రోజు ‘సుపరిపాలనలో తొలి అడుగు’

    కృష్ణా: నందిగామ నియోజ‌క‌వ‌ర్గం కంచిక‌చ‌ర్లలోని మోడల్ కాలనీలో రెండవ రోజు నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు.
    ఆయనకు కంచిక‌చ‌ర్ల ప్ర‌జ‌లు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగ‌తం ప‌లికారు. ఇంటింటికి తిరుగుతూ.. కూటమి పాలనపై ప్ర‌జాభిప్రాయ‌లు అడిగి తెలుసుకున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

  • తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి పర్యటన

    ఎన్టీఆర్: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం చేపట్టారు. తొమ్మిదో వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

  • కంభంపాడులో హెల్త్ క్యాంపు ఏర్పాటు

    ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ వారు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచి కోట పుల్లమ్మ, ఎంపీటీసీ కోట పుల్లారావు, ఆర్గనైజర్స్ ఆర్య వైశ్య కల్యాణ మండపం ప్రెసిడెంట్ దారా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

  • ప్రజా సంక్షేమమే మా ధ్యేయం: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలోని 1, 2వ వార్డు కాకాని నగర్లో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఆరా తీశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సుపరిపాలన అందించటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.

     

  • ‘నీటి వృథాను అరికట్టండి’

    ఎన్టీఆర్: తాగునీటి పైపుకు మరమ్మతులు చేయాలని స్థానికలు కోరారు. విజయవాడ క్రీస్తు రాజపురంలోని గంటావారి అపార్ట్మెంట్స్ వీధిలో కొండమీదికి వెళ్లే పైపులైనుకు డామేజ్ కావడంతో గత 2రోజుల నుండి త్రాగునీరు వృధాగా పారుతుంది. కొండప్రాంత ప్రజలకు మంచినీటి వసతి పూర్తిగా లేదని అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. పైపులకు మరమ్మతులు చేసి కొండ ప్రాంత ప్రజలకు తాగునీరు అందిచాలని వారు కోరుతున్నారు.

  • నేడు కంకిపాడులో ప్రైవేట్ పాఠశాలలు బంద్!

    కృష్ణా: కంకిపాడులో నేడు ప్రైవేట్ పాఠశాలలు మూసివేస్తున్నట్లు తమ సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (అపుస్మా) జిల్లా శాఖ తెలిపింది. ఆర్.టి. ఇ.12.1.సి దరఖాస్తుల ధ్రువపత్రాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, గందరగోళాన్ని నివారించాలనే ప్రధాన విన్నపంతో శాంతియుత నిరసన చేపడుతున్నామన్నారు. సంఘ ప్రతినిధులు, సభ్యులు ప్రదర్శనగా వెళ్లి వివిధ స్థాయిలో విద్యాశాఖ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు.

  • మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ?

    కృష్ణా: మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయంలో 4, 8, 9, 10, 11, 12 తరగతుల్లో మిగులిన సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10, 12 తరగతుల్లో కేటగిరి 1, కేటగిరి 2 వారికి మాత్రమే సీట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ తెలిపారు. 9వ తరగతి వారికి ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  • నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీ

    ఎన్టీఆర్: ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ నుంచి ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో ఏసీఏ సెంట్రల్ జోన్ సీనియర్ మల్టీ డే అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తారని ఏసీఏ వర్గాలు తెలిపాయి. తొలి రోజైన గురువారం డీవీఆర్ మైదానంలో గుంటూరు, పశ్చిమ గోదావరి, సీపీ మైదానంలో కృష్ణా, ప్రకాశం జట్ల మధ్య మ్యాచ్లు ఉంటాయన్నారు.