Locations: Krishna

  • రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా.. 2రోజుల పాటు

    ఎన్టీఆర్: ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరేళ్లుగా పెండిగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 4, 5 తేదీల్లో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని విజయవాడ జోన్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు తెలిపారు. అన్ని డిపోలలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

     

  • ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ?

    ఎన్టీఆర్: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2025కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. ఈనెల 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి గలవారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

    vu

  • జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు

    ఎన్టీఆర్ జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. తిరువూరు 18.6మి.మీ, విస్సన్నపేట 16.2మి.మీ, గంపలగూడెం 14మి.మీ, ఎ.కొండూరు 10.4మి.మీ, రెడ్డిగూడెం 9.2మి.మీ, వత్స 7.4మి.మీ, వీరులపాడు 7.2మి.మీ., మైలవరం 6.4మి.మీ, కంచికచర్ల 4.8మి.మీ, జి. కొండూరు 4మి.మీ, జగ్గయ్యపేట 3.8మి.మీ, పెనుగంచిప్రోలు 3.6మి.మీ, ఇబ్ర హీంపట్నం 3.4 మిల్లీ మీటర్ల మేర వర్షం పడినట్లు తెలిపారు.

  • విజయవాడలో హృదయవిదారక ఘటన.. నడిరోడ్డుపై రక్తస్రావంతో శిశువు!

    ఎన్టీఆర్: విజయవాడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని పోతిన సాయిప్రసాద్‌వీధిలో ఓ నవజాత మగ శిశువును అర్ధరాత్రి రోడ్డుపై వదిలేశారు. ఎలుకలు కొరకడంతో గాయాలై, రక్తం కారుతుండగా ఆ శిశువు ఏడుస్తూ కనిపించాడు. స్థానికులు గుర్తించి అక్కున చేర్చుకుని, చికిత్స నిమిత్తం పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంగన్‌వాడీ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

     

  • ‘త్యాగాలకు ప్రతీక ‘మొహర్రం’ పండుగ’

    కృష్ణా: పెడన పట్టణంలో ముస్లిం సోదరులు 11 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్రంగా జరుపుకునే మొహర్రం వేడుకల్లో బుధవారం రాత్రి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం పండుగ త్యాగాలకు ప్రతీకగా అన్నారు.  మతాలకు అతీతంగా మొహర్రం జరుపుకుంటారని అన్నారు.

  • పవన్‌పై కేసు.. మురుగన్‌పై దాడిలాంటిదే: మాధవ్

    తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌‌పై కేసునమోదు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో దుర్మార్గపు పాలన ఉందన్నారు. పవన్‌పై కేసు పెట్టడాన్ని మురుగన్‌పై దాడిగా భావిస్తామని మాధవ్‌ చెప్పారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి అండగా పవన్‌ కూడా రంగంలోకి దిగారన్నారు. వారిద్దరికీ అండగా ఉంటామని తెలిపారు. డీఎంకే ఓటమి తథ్యమని మాధవ్‌ చెప్పారు.

  • ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి

    కృష్ణా: నందివాడ మండలంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ఇంటింటి ప్రచారాన్ని బుధవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన  మండలంలోని పెదలింగాల, చినలింగాల గ్రామాల్లో పర్యటించి, ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఏడాది పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు.

     

  • అబద్దాలకు కేరాఫ్‌గా చంద్రబాబు : అవినాష్

    ఎన్టీఆర్: ఏడాదిగా కూటమి ప్రభుత్వం మోసాలు కొనసాగుతున్నాయని YCP జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు. చంద్రబాబు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టోలో హామీల గురించి ఎప్పుడూ మాట్లాడటం లేదన్నారు. ప్రజలు చంద్రబాబుని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

  • కూటమి తోనే ప్రజలకు సంక్షేమాలు

     తిరుపతి: శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో ఏర్పేడు మండలం ముసలిపేడు పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నారు. కార్యక్రమంలో పేరం ధనంజయులు నాయుడు, మోహన్ నాయుడు, రెడ్డివారి గురవరెడ్డి, శివశంకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • ‘దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి’

    ఎన్టీఆర్: ఈనెల 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదంచేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పిలుపునిచ్చారు.  బుధవారం కంచికచర్ల మండల ఐఎఫ్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండల కార్యదర్శి జీ.హరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కొడులను రద్దు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గ్యాస్ బండలు ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.