కృష్ణా: కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడంపై జిల్లా పోలీసులు ఓ స్పెషల్ వీడియో రూపొందించారు. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం డైలాగులతో వీడియో చేశారు. సీల్ట్‌బెల్ట్ పెట్టుకోండి అంటూ వీడియోలో బాలకృష్ణ కోరతారు. డ్రైవర్‌తో పాటు పక్కన ఉన్న ప్రయాణికుడు కూడా సీల్ట్ బెల్ట్ వేసుకోవాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Locations: Krishna
-
‘మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఈవో సుధాకర్‌కు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. 4నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, తక్కువ వేతనం, సెలవులు లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకుడు మరసకట్ల త్యాగరాజు కోరారు.
-
‘ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
కృష్ణ: సంక్షేమ పథకాలతోపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని నందిగామ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల బోసు పేర్కొన్నారు. కంచికచర్ల పరిధి వసంత కాలనీలోని ఇంటి ఇంటికి వెళ్లి ఏడాది పాలలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
-
నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు
ఎన్టీఆర్: విసన్నపేట మండలం విస్ననపేట గ్రామంలో ప్రముఖ వైభవ్ జ్యూయలరీ అధినేత, AMC వైస్ ఛైర్మన్ కుక్కడపు నాగేశ్వరావు తల్లి కుక్కడపు సుశీల పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజర్యారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
VIDEO: కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద
ఎన్టీఆర్: గంపలగూడెం మండలం వినగడప-తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. కట్టలేరు వాగుపై వరద నీరు ప్రవహిస్తే సుమారు 24 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
-
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తాం: ఎమ్మెల్యే
కృష్ణా: పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. బుధవారం కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తామన్నారు. ప్రజల ఆశీర్వాదాలే తమ విజయానికి నిదర్శనమని అన్నారు.
-
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలు నుజ్జునుజ్జు
ఎన్టీఆర్: విజయవాడ కృష్ణలంక సత్యం హోటల్ సెంటర్ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వారధి వైపు నుంచి వస్తున్న లారీ, ముందున్న RTC బస్సును ఢీకొని డివైడర్ దాటి మరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో 2లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని, లారీలో ఇరుక్కున్న డ్రైవర్లు, క్లీనర్లను క్రేన్‌తో బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. -
రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు
ఎన్టీఆర్: విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న RTC బస్సును వారధి వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టి డివైడర్ దాటి మరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీలో ఇరుక్కున్న డ్రైవర్లు, క్లీనర్లను క్రేన్ సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
-
మోపిదేవిలో విజయనగరం స్వామీజీ పూజలు
కృష్ణా: మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని విజయనగరం జిల్లాకు చెందిన శ్రీ గురుసాయి సుందర మహారాజ్ స్వామీజీ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీకి దేవస్థానం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్‌రావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని స్వామీజీకి అందజేశారు.
-
ప్రజల చెంతకు కూటమి విజయాలు
ఎన్టీఆర్: నందిగామలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను మాజీ మంత్రి పంపిణీ చేశారు.