Locations: Krishna

  • ప్రజల్లోకి కూటమి ‘సుపరిపాలన..’!

    ఎన్టీఆర్: విసన్నపేటలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. కూటమి నాయకులు పట్టణంలోని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నెక్కళపు వెంకటేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు మధు కొంగల తదితరులు పాల్గొన్నారు.

     

     

  • సుల్తానగరంలో మంత్రి కొల్లు తొలి అడుగు

    కృష్ణా: కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం సుల్తానగరంలో ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చామన్నారు. గత పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. పెన్షన్లు పెంచామని, ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నామని తెలిపారు.

     

     

  • మమ్మల్ని పట్టించుకునే వారే లేరా?

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలోని రైతుల కన్నీటి నిరసన కొనసాగుతునే ఉంది. గ్రామ సమీపంలో క్వారీలు, క్రషర్ల కారణంగా పంట పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని రైతులు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకునే అధికారులు లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బినామీల క్వారీల నుంచి రైతాంగాన్ని కాపాడమని వేడుకుంటున్నారు.

  • పారిశుద్ధ్యం ఆరోగ్యానికి రక్ష: కమిషనర్

    ఎన్టీఆర్: తిరువూరు పట్టణ ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మనోజ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోని వాడిన చెత్తను ఖాళీ ప్రదేశాలలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. డ్రైనేజీ సమస్య ఉంటే తక్షణమే తమకు తెలియజేయాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.

     

  • ప్రజల చెంతకు సుపరిపాలన

    ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో సుపరిపాలన ప్రజల చెంతకు చేరింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని తిరుమలగిరిలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్  నెట్టెం రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

     

  • బైకు పార్కింగ్ విషయంలో గొడవ.. యువకుడిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి(VIDEO)

    కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయం ఎదుట ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక యువకుడిని కర్రతో కొట్టాడు. ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న తన భార్య కోసం వచ్చిన యువకుడు బైక్ పార్క్ చేయగా, దానిని తీసేయాలని కానిస్టేబుల్ ఆదేశించడంతో వాగ్వాదం పెరిగి దాడికి దారితీసింది. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై సీఐ నబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “పర్మిషన్ తీసుకుని వీడియో తీస్తున్నారా?” అని ప్రశ్నించారు.

  • పులిగడ్డలో సెర్చ్.. 28 వాహనాలు సీజ్

    కృష్ణా: పులిగడ్డలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో 75 పోలీస్ సిబ్బందితో సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 197 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 27 మోటార్ సైకిళ్లు, ఓ ఆటోను సీజ్ చేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు యువకుమార్, ఈశ్వరరావు, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల ఎస్సైలు పాల్గొన్నారు.

  • ‘కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి’

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలోని విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు విజయవాడలో బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను దశల వారీగా రెగ్యులర్ చేయాలని, బకాయిలు విడుదల చేయాలని కోరారు. స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

  • విషాదం.. తల్లి కళ్లెదుటే కుమారుడు స్పాట్‌ డెడ్

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం గౌరవరం బుధవారం ఉదయం 7.40గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లో గురునానక్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శశికళ తన కుమారుడు, కూతురుతో కారులో విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో రివ్యూ మీటింగ్‌కి వెళుతుంది. ఎదురుగా వస్తున్న ట్రాలీని తప్పించబోయి కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో శశికళ కుమారుడు సాత్విక్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తల్లీకూతుర్లను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

     

  • జాతీయస్థాయి కత్తిసాముకు కార్తికేయ ఎంపిక

    ఎన్టీఆర్: జాతీయస్థాయి అండర్-10 ఫెన్సింగ్ (కత్తిసాము) పోటీలకు కొండపల్లి డీఏవీ స్కూల్ 3వ తరగతి విద్యార్థి మోక్షిత్ కార్తికేయ ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మన్మోహన్ తెలిపారు. జూలై 5 నుంచి 8 వరకు మహారాష్ట్ర నాసిక్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో కార్తికేయ ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించనున్నాడు. నైపుణ్యం ప్రదర్శించిన కార్తికేయను, ప్రోత్సహించిన వ్యాయామోపాధ్యాయుడు మాధవరావును పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.