Locations: Krishna

  • బీచ్ గేట్లు తెరిచేది ఆరోజే!

    కృష్ణా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లను మూసివేసినట్లు ఇన్‌ఛార్జ్ ఫారెస్ట్ ఆఫీసర్ మోహిని విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు ఈదురుగాలులు తీవ్ర కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 4వ తేదీ వరకు బీచ్ గేట్లను మూసి వేస్తామని వివరించారు. పర్యాటకులు సహకరించాలని కోరారు.

  • రైతుల కన్నీటి గాథ.. వినరే వారి వ్యథ..!

    ఎన్టీఆర్: పండించిన పంటలు క్వారీల వల్ల వచ్చే దుమ్ముతో పంటలు పండక, దిగుబడులు తగ్గుతున్నాయని  కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రషర్ల నుంచి వచ్చే ధూళి, దుమ్ముతో పంటలు పండక, రూ.లక్షలు నష్టపోతున్నామని నిరసన తెలిపారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్‌.. డీన్‌ కుమారుడు సస్పెండ్!

    గుంటూరు: మంగళగిరి ఎయిమ్స్‌లో సీనియర్ల ర్యాగింగ్‌ కారణంగా ఓజూనియర్‌ వైద్యవిద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై విచారణ జరిపిన యాజమాన్యం, 13మంది సీనియర్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. వారిలో డీన్‌ కుమారుడు ఉన్నాడు. ర్యాగింగ్‌ తీవ్రతను బట్టి ఏడాదిన్నర, సంవత్సరం, 6నెలలపాటు సస్పెండ్‌ చేయడంతో పాటు, ఒక్కొక్కరికి రూ. 25 వేల జరిమానా విధించారు. ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా లేదా అనే దానిపై స్పష్టతలేదు.

  • జగన్మాత సేవలో సీపీ రాజశేఖరబాబు

    ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సీపీ రాజశేఖరబాబు దర్శించుకున్నారు. అనంతరం ఈవో శీనానాయక్‌తో కలిసి దేవస్థానం మహామండపం నుంచి కనకదుర్గానగర్, ఇటీవల ఆక్రమణలు తొలగించిన ప్రదేశాలను, కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం, పున్నమి, భవాని ఘాట్లను పరిశీలించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద హోల్డింగ్ ఏరియా అభివృద్ధి, అక్కడనుంచి భక్తులను దేవస్థానానికి చేర్చే ఏర్పాట్లపై ఏఈ కోటేశ్వరరావు, పశ్చిమ ఏసీపీ దుర్గారావు వివరించారు.

  • విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

    కృష్ణా: గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన స్థాయిని స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి పాఠశాలలో చేశారు. అనంతరం వారితో శిక్షణ అంశాలపై మచ్చటించారు.

  • మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట

    కృష్ణా: మతాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట రక్షణకోరుతూ మచిలీపట్నం పోలీసులను ఆశ్రయించింది. బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన పరిశె తరుణ్‌కృష్ణ(21), రాజుపేటకు చెందిన ముస్లిం యువతి అబ్దుల్ మెహబూబున్నీసా(20) 10వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ఇష్టంలేని తల్లిదండ్రులు యువతిని విజయనగరం తీసుకెళ్లి బంధించగా.. తరుణ్ అక్కడికెళ్లి పెళ్లిచేసుకుని మచిలీపట్నం తీసుకొచ్చాడు. పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

     

  • వికలాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ

    ఎన్టీఆర్: నందిగామలో సత్య దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో 12సంవత్సరాలుగా ప్రతి నెల వికలాంగులకు నిత్యవసర సరుకులు, బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. మంగళవారం 15మంది వికలాంగులకు బియ్యం, కందిపప్పు, బెల్లం, నూనె, చింతపండు, పంచదార, గోధుమపిండి, ఉప్పు, ఉల్లిగడ్డలు అందజేశారు. దాతలు తలమాల చినరాయప్ప, మేరీల జ్ఞాపకార్థం వారి కుమారులు, కుమార్తెలు పాల్గొన్నారు. నిర్వాహకులు కోటి సూర్యం దాతలను అభినందించారు.

  • ప్రజల ఆరోగ్యం, శుభ్రతకు డ్రైనేజీ వ్యవస్థ కీలకం: MLA

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య స్వయంగా పరిశీలించారు. ప్రజల ఫిర్యాదులపై స్పందించి, అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం, శుభ్రతకు డ్రైనేజీ వ్యవస్థ కీలకమన్నారు. తాత్కాలిక చర్యలతోపాటు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధంచేయాలని ఆయన తెలిపారు. ప్రజలు ఎమ్మెల్యే స్పందనపై హర్షం వ్యక్తంచేశారు.

  • ఆరోగ్య సంపన్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం: మంత్రి

    ఎన్టీఆర్: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నిర్వహించిన డాక్టర్స్ డే  సెలబ్రేషన్స్‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. వైద్య రంగంలో అసాధారణ సేవలు అందించిన డాక్టర్లకు మంత్రి అవార్డులు అందజేశారు. డాక్టర్లను సన్మానించడం సంతోషకరమన్నారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ఆరోగ్య సంపన్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. డాక్టర్లు సేవాభావం, మానవతాదృక్పథంతో ప్రజలకు సేవలందించాలని సత్యకుమార్ సూచించారు.

  • ఆ బడికి వెళ్లాలంటే.. బురదలో నడవాల్సిందే..

    ఎన్టీఆర్: మైలవరంలోని చంద్రబాబునగర్ రింగు నుంచి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే రహదారి బుడమేర వాగులో ఇసుక ట్రాక్టర్ల తాకిడితో గోతులతో బురదమయంగా మారింది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులు, గర్భిణీలు, బాలింతల అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీ అధికారులు, నాయకులకు విజ్ఞప్తిచేసినా ఫలితం లేదని, ఎమ్మెల్యే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.