Locations: Krishna

  • ‘వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసం’

    ఎన్టీఆర్: నందిగామలోని కాకాని నగర్‌లో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఆమె ఆదేశాలతో ‘సుపరిపాలనలో-తొలి అడుగు’ కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. విజయవాడ పార్లమెంట్ CUBఇన్‌ఛార్జ్ షేక్.ఖాజా, నియోజకవర్గ పరిశీలకులు సుబ్రమణ్యం,వీరబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వెంకటసత్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణకుమారి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని వారు విమర్శించారు. కూటమిప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు తెలియజేయాలన్నారు.

  • ‘పూతకు ముందే పిచికారీ చేయాలి’

    ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో ఏడీఎ కె.శశికళ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.రాజశేఖర్ మాట్లాడుతూ.. వరిలో సస్యరక్షణ, కలుపు నివారణపై వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త కె.లక్ష్మీకళ మామిడిలో తామర పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్, బూప్రోఫెజిన్ వంటి మందులను పూతకు ముందు పిచికారీ చేయాలన్నారు.

  • కంచికచర్లలో చిరుజల్లులు.. అన్నదాత హర్షం

    ఎన్టీఆర్: కంచికచర్ల ప్రాంతంలో సోమవారం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. ఈ తరుణంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు, మొక్కజొన్న, పత్తి, పెసర, మినుము, కంది వంటి పంటలు కళకళలాడుతున్నాయి. రెండు రోజుల్లోనే పైరుల్లో పెను మార్పు వచ్చింది. 90% మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ వర్షాలు మరో 15రోజులు పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • వివాహితపై పెట్రోల్ పోసి.. దారుణ హత్య!

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హైమావతి(60) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కర్రతో ఆమె తలపై కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తుందని వారు అనుమాన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని సమాచారం.

     

  • మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నిరసన

    ఎన్టీఆర్: మహా న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నందిగామలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదని, అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చూసుకోవాలని, దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నందిగామ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

  • లేళ్ల గరువు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

    కృష్ణా: గూడూరు మండలం లేళ్ల గరువు గ్రామాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నీరు, పారిశుధ్యం, తదితర రకాల రికార్డులను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాన్ని సందర్శించి, గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ పాఠశాలలపై ఆరా తీశారు.

  • శ్రీవారి ఆశీస్సులతో పోలవరం-బనకచర్ల పూర్తి కావాలి: మంత్రి కొల్లు

    తిరుపతి: రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు.. శ్రీవారి ఆశీస్సులతో పూర్తి కావాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకొన్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • ‘దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి’

    ఎన్టీఆర్: ఈ నెల 9వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జి.కొండూరు యూనియన్ అధ్యక్షుడు సుందరరావు, ఉపాధ్యక్షురాలు సునీత పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ జి.కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  • పెన్షన్లు ఆర్థిక భరోసా: కోగంటి

    ఎన్టీఆర్: పెన్షన్లు వృద్ధులు, వితంతువులకు ఆర్థిక భరోసా అని కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కోగంటి బాబు అన్నారు. నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల పట్టణ పరిధిలోని చెరువు కట్ట బజార్‌లో పెన్షన్‌లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కోగంటి మాట్లాడుతూ.. పెన్షన్ దారుల కళ్లల్లో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యమని తెలిపారు.

  • పింఛన్ అందుకున్న 102 ఏళ్ల బామ్మ

    కృష్ణా: పెడన పట్టణంలోని 4వ వార్డులో ఉన్న మైమున్నిసా(102) అనే వృద్ధురాలికి మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి వృద్ధాప్య పింఛన్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాహితున్నిసా, వార్డు ఇన్‌ఛార్జ్ అజీమ్, సచివాలయ అడ్మిన్ దేవకి, తదితరులు పాల్గొన్నారు.