ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీరమ్య, కడప జిల్లాకు చెందిన నిఖిల్‌రెడ్డిలు ప్రేమించుకొని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పటాన్‌చెరులోని ఒకే ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు. అయితే అంతలోనే వారిని విధి ఎక్కిరించింది. 4రోజులక్రితం జరిగిన కంపెనీలో పేలుడులో ఇద్దరూ మరణించారు. దీనిపై ఎమ్మెల్యే కొలికిపూడి స్పందించి ఈమధ్య రమ్య మాఇంటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడిందని, ఎంత కంట్రోల్ చేసుకున్నకన్నీళ్లు ఆగటం లేదని వాపోయాడు.
Locations: Krishna
-
విషాద ప్రేమకథ.. అగ్నిప్రమాదంలో అసువులుబాసిన నిఖిల్, రమ్య
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీరమ్య, కడప జిల్లాకు చెందిన నిఖిల్‌రెడ్డి, ఇద్దరూ పేద కుటుంబాల నుంచి వచ్చి పటాన్‌చెరులోని ఒకే ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబాల అంగీకారం పొంది, ఆషాఢం తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, నాలుగు రోజుల క్రితం జరిగిన కంపెనీలో పేలుడులో ఇద్దరూ మరణించారు. ఈవిషాదం 2కుటుంబాలకు తీరని గుండెకోతను మిగిల్చింది.
-
కంచికచర్లలో పింఛన్ల పంపిణీ షురూ
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల మండల టీడీపీ అధ్యక్షులు, ఏఎంసీ ఛైర్మన్ కోగంటి ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు.
-
‘పెన్షన్ల పంపిణీలో అవినీతికి పాల్పడితే చర్యలు’
ఎన్టీఆర్: ఎన్నడూ లేని విధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మూడు రెట్లు పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను కూటమి ప్రభుత్వం అర్హులకు అందిస్తుందని టీడీపీ పెడన మండల అధ్యక్షులు వీరప్రసాద్ తెలిపారు. మంగళవారం పెడనలో జరిగిన పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు నగదు అందజేశారు. పెన్షన్ పంపిణీలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
-
కంభంపాడు సమస్యలపై కలెక్టర్‌కు వినతి
ఎన్టీఆర్: ఎ.కొండూరు మండలం కంభంపాడులో నెలకొన్న వివిధ సమస్యలపై గ్రామ సర్పంచ్ కోట పుల్లారావు జిల్లా కలెక్టర్ లక్ష్మీశాకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ వినతిని స్వీకరించి, సమస్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
-
నకిలీ పోలీసుల అవతారంలో.. నకిలీ గోల్డ్ బిజినెస్ చేస్తున్న నలుగురు అరెస్ట్!
తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసగించిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా విజయవాడకు చెందిన రాజేంద్రప్రసాద్‌ను రూ.7.32 కోట్ల మేర మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి నుంచి రూ.6.40లక్షల నగదు, 4కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పోలీసుల పేరుతో మోసాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
-
పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్
ఎన్టీఆర్: ఏ కొండూరు మండలంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పర్యటించారు. ముందుగా కంభంపాడులోని జలజీవన్ మిషన్ పనులను పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
-
94ఏళ్ల వృద్దురాలికి ఎంత కష్టం.. కలెక్టరేట్‌కి వచ్చి..
ఎన్టీఆర్: 94 సంవత్సరాల జాలాది లక్ష్మీకాంతం విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరు నుంచి సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కి వచ్చి తన కష్టాన్ని చెప్పుకున్నది. నాలుగేళ్ల క్రితం భర్త, 9 ఏళ్ల క్రితం కొడుకు చనిపోయారని ప్రస్తుతం ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదన్నారు. బాసటగా నిలవాలని ఆమె అధికారులకు విన్నవించింది. -
నేడు ‘సుపరిపాలన-తొలి అడుగు’పై సమావేశం
ఎన్టీఆర్: కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమంపై నందిగామలోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు పార్టీ క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జులు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, గ్రామ, వార్డు ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుందని చెప్పారు.
-
మద్యం మత్తులో గొడవ.. కొడుకును రాయితో కొట్టి చంపిన తండ్రి!
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ మహమ్మద్ పేటలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తున్న గొళ్ళ వెంకటనారాయణను(35).. తండ్రి కృష్ణ రాత్రి జరిగిన గొడవలో రాయితో కొట్టి చంపాడు. తలకు బలమైన గాయం కావడంతో వెంకటనారాయణ మరణించాడు. వెంకటనారాయణ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.