ఎన్టీఆర్: కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో పునాదిపాడు-ఉప్పలూరు ప్రధాన రహదారికి పనులకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల పాటు గుంటల రహదారిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
Locations: Krishna
-
రేపు పవర్ కట్.. ఎక్కడంటే..
కృష్ణా: మచిలీపట్నంలో మంగళవారం విద్యుత్ లైన్ల మరమత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బలరాముని పేట, మూడు స్తంభాల సెంటర్, కుమ్మరిగూడెం ఏరియాలకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని మచిలీపట్నం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.
-
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఓల్డ్ బైపాస్ రోడ్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో సీఐ వై.వి.ఎల్. నాయుడు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఏడుగురిని అదుపులోకి తీసుకుని, రూ.6,000 నగదు స్వాధీనం చేశారు. నందిగామ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.
-
‘ఉష వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారు’
ఎన్టీఆర్: నందిగామలోని కాకాని వెంకటరత్నం కళాశాలలో 39ఏళ్లుగా ఆఫీసులో వివిధ శాఖల్లో పనిచేసి ఆఫీస్ సూపరింటెండెంట్‌గా జొన్నలగడ్డ ఉష పదవీ విరమణ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా.పి.రాయప్ప అధ్యక్షతన జరిగిన సభలో పాలకవర్గ ఉపాధ్యక్షులు వెచ్చ ఉమామహేశ్వర గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉష అంకితభావం, క్రమశిక్షణను పలువురు కొనియాడారు. కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు.
-
జాతీయ సదస్సుకు నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్
ఎన్టీఆర్: నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి జూలై 3,4తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లో కేంద్రప్రభుత్వం జాతీయస్థాయిలో జరిగే ‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర’ సదస్సులో పాల్గొననున్నారు. ఈ జాతీయ సమావేశానికి ఏపీ నుంచి మేయర్లు,చైర్మన్లు,డిప్యూటీ చైర్మన్లను నామినేట్ చేశారు. నోడల్ ఆఫీసర్‌గా రాజమండ్రి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగ నరసింహారావు వ్యవహరిస్తారని మునిసిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు.
-
నిఘా నేత్రం చూస్తుంది.. జాగ్రత్త..!
కృష్ణా: కాలేజీల వద్ద వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల ఆటకట్టించారు గుడివాడ పోలీసులు. నారాయణ కాలేజీ వద్ద సోమవారం సాయంత్రం తరగతులు ముగించుకొని విద్యార్థినులు బయటకు వస్తుండగా కొంతమంది ఆకతాయిలు బైక్‌లతో వారిని భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో పరిశీలించి.. శక్తి టీమ్‌లను అలర్ట్ చేసి ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించారు.
-
విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి
కృష్ణా: విద్యుత్ షాక్‌కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన పెదపారుపూడి మండలం యలమర్రులో జరిగింది. పొలంలో గట్లు వేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ మోటర్ నుంచి విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురై కలుపుకూరి సూరి(18) మరణించాడు. మృతునిది పల్నాడు జిల్లా శవల్యపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం
కృష్ణా: బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, అబ్బయ్య చౌదరి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు.
-
‘ఆ దుష్ప్రచారంపై చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి’
ఎన్టీఆర్: మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరుతున్నారంటూ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కంచికచర్లకు చెందిన టీడీపీ నాయకుడు కోయ గిరిధర్ కంచికచర్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ చవాన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేస్తూ, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
-
పెడనలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
కృష్ణా: పెడన టీడీపీ కార్యాలయంలో ‘సుపరిపాలనలో-తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హాజరై కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు గొట్టిముక్కల రఘురామరాజు, పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.