Locations: Krishna

  • ‘చివరి పొలాల వరకు సాగునీరు అందించడమే లక్ష్యం’

    కృష్ణా: పెదపారుపూడి మండల కేంద్రంలో సోమవారం ఉదయం నీటి సంఘం అధ్యక్షుడు కాగితం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సాగునీరు దిగువ ప్రాంతాలకు విడుదల అయ్యేలా పూడికతీత పనులు చేపట్టారు. వెంట్రప్రగడ సౌత్ ఛానల్ నుంచి సాగునీరు వానపాముల, జమీదింటకుర్రు, పెదపారుపూడి, బేతవోలు పొలాల వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చివరి పొలాల వరకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు.

     

  • మందు బాబులను పట్టించిన డ్రోన్ కెమెరాలు

    కృష్ణా: మచిలీపట్నంలో మద్యం తాగుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుల్తానగరం శివారులో నలుగురు మద్యం తాగుతున్నట్లు డ్రోన్ కెమెరాల్లో కనిపించారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు బందరు తాలూకా పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ ప్రారంభం

    కృష్ణా: మచిలీపట్నంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంల బదిలీ ప్రక్రియ సోమవారం ప్రారంభమయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఏఎన్ఎంలు బదిలీలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం వద్దకు భారీగా ఏఎన్ఎంలు చేరుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి శర్మిష్ట ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియను ఆ శాఖ ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు.

     

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

    AP : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు విజయవాడ నోవోటెల్ హోటల్‌కు చంద్రబాబు రానున్నారు. 10.30 గంటలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో పాల్గొంటారు. అనంతరం ఆయన తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నోవాటెల్ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • నేడు ‘డయల్ యువర్ డీఎం’

    కృష్ణా: గన్నవరం ఆర్టీసీ డిపో పరిధిలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు మేనేజరు పి.శివాజీ తెలిపారు. సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య 8790996090 నంబరుకు ఫోన్ చేసి ప్రజా రవాణా సమస్యలు, సూచనలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చని అన్నారు.

  • నేడు మచిలీపట్నంలో ‘పీజీఆర్‌ఎస్’

    కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టరేట్‌‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ పరిష్కార వేదిక ఉంటుందని అన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

     

  • అలర్ట్.. నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు

    కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. బాస్కెట్ బాల్ కోర్టు ఆవరణలో రిజిస్ట్రేషన్, ఆడిటోరియంలో దరఖాస్తులను పూరించడం, కేటగిరీ, అకాడమిక్ పరిశీలన, సీట్ల కేటాయింపు, డాటా ఎంట్రీ, ధ్రువపత్రాలు తీసుకోవడం, గుర్తింపు కార్డు పంపిణీకి ఏర్పాటు చేశామన్నారు. జూన్ 30, జూలై 1వ తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

  • నేడు విజయవాడలో క్వాంటమ్‌ వ్యాలీపై వర్క్‌షాప్‌

    AP : అమరావతి క్వాంటమ్‌ వ్యాలీపై సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు. CM చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం రాత్రి వారికి విందు ఇచ్చారు.

  • ‘ఇలాంటి దుష్ప్రచారంపై గందరగోళానికి గురిచేస్తాయి’

    ఎన్టీఆర్: మాజీ మంత్రి దేవినేని ఉమాపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారంపై ఖండిస్తూ కంచికచర్ల టీడీపీ నాయకులు బుడ్డి సూర్య ప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమా పార్టీ మారుతున్నారనే అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి దుష్ప్రచారంపై కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తాయని ఆయన అన్నారు.

  • ఫోటోగ్రాఫర్స్ ఎక్స్‌పో పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి

    ఎన్టీఆర్: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూలై 4,5,6వ తేదీలలో విజయవాడలోని మన కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయిలో ఫోటోగ్రాఫర్స్ ఎక్స్‌పో పోస్టర్‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో 20సూత్రాల కమిటీ ఛైర్మన్ దినకర్, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్, ఫోటోగ్రాఫర్స్ రాష్ట అసోసియేషన్ ఛైర్మన్ రమేష్ పాల్గొన్నారు. ఈ ఎక్స్‌పో సుమారు 10వేల పాల్గొనే అవకాశం ఉందన్నారు.