Locations: Krishna

  • అమ్రిత సాయి కాలేజీలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

    ఎన్టీఆర్: పరిటాల అమ్రిత సాయి ఇంజనీరింగ్ కాలేజీలో వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ శశిధర్ తెలిపారు. సెక్రటరీ రామ మోహన రావు, సీఈఓ సాయి మనోజ్ పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక చవితిని ఆనవాయితీగా జరుపుకుంటామని, విద్యార్థులకు విజయం కలగాలని ఆకాంక్షించారు. B.Tech CIC విభాగం లడ్డూ వేలంపాటలో కైవసం చేసుకోగా, విద్యార్థులు, అధ్యాపకులు భక్తితో ఊరేగింపులో పాల్గొన్నారు.

  • ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు కార్యచరణ ఇదే..!

    ఎన్టీఆర్: సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలతోపాటు ప్రచార జాతాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి, అసెంబ్లీ సమావేశాల్లో భారీ నిరసన చేపడతారు. స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహనమిత్ర కింద రూ.30వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో బంద్‌కు వెళతామని హెచ్చరించారు.

  • ‘గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ’

    కృష్ణా: గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర పరిశోధన సులభతరమవుతుందని చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు తెలిపారు. గురువారం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామాన్ని ఎస్ఐ సత్యనారాయణతో సీఐ సందర్శించారు. సొసైటీ, పంచాయతీ, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మొత్తం 22సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీలతో ప్రారంభిస్తామని సొసైటీ ఛైర్మన్ సుబ్బారావు తెలిపారు.

  • గణనాథుడిని దర్శించుకున్న కోగంటి

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో స్థానిక హనుమాన్ పేట చవితి పూజలనందుకుంటున్న గణనాథుడిని మండల టీడీపీ అధ్యక్షుడు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

  • ‘రైతులకు మెరుగైన సేవలు అందిస్తే గుర్తింపు: MLA

    ఎన్టీఆర్: కంచికచర్ల ప్రాథమిక సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన గుత్తా వీర వెంకటరత్నంను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సౌమ్య మాట్లాడుతూ..వెంకటరత్నం నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధిస్తుందని నమ్మకం ఉందని ప్రశంసించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తే గుర్తింపు వస్తుందన్నారు.

  • రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయం: దేవినేని ఉమా

    ఎన్టీఆర్: కంచికచర్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(PACS) త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఛైర్మన్‌గా గుత్తా వీర వెంకటరత్నం, సభ్యులుగా కొండలరావు, వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయమన్నారు. సొసైటీ అభివృద్ధి,యూరియా సరఫరా, రైతులకు మద్దతు ధర కోసం కృషి చేయాలని దేవినేని సూచించారు.

  • ముసలోళ్లతో కలిసి చోరీలు.. మహిళా దొంగలు అరెస్ట్

    కృష్ణా: అమ్మమ్మ, నాయనమ్మలతో కలిసి చోరీలు చేస్తున్న మహిళా దొంగలను నాలుగు రోజుల్లోనే గుడివాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ ధీరజ్ వినిల్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఖాళీగా ఉన్న ఇంట్లో అద్దెకు దిగి యజమానితో స్నేహంగా ఉంటూ చోరీకి పాల్పడ్డారు. నిందితులు రాజేశ్వరి, రమావతి, రాగమాధురిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 71.04గ్రాముల బంగారం, 327గ్రాముల వెండి, పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • ‘అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలే’

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలో మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్, రెవెన్యూ అధికారి మానస, డిప్యూటీ తహశీల్దార్, ఎస్ఐ విశ్వనాథ్‌లు ఎరువుల డీలర్ల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా నిల్వ, బ్లాక్ మార్కెట్ విక్రయాలను నిషేధిస్తూ సూచనలు జారీ చేశారు. యూరియా స్టాక్స్ అందుబాటులో ఉన్నాయని, రైతులు అధైర్యపడవద్దని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • ‘రైతాంగ అభ్యున్నతికి ఎమ్మెల్యే వెనిగండ్ల కృషి’

    కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలో రైతాంగ అభ్యున్నతే ఎజెండాగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పెంజేండ్ర వ్యవసాయ సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేకు కూటమి నాయకులు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. పాలకోడు డ్రైన్ మరమ్మతులు చేసినందుకు రైతులు ఎమ్మెల్యే రాముకి ధన్యవాదాలు తెలిపారు.

  • ‘చట్టాలపై అవగాహన.. బాల్యానికి రక్షణ’

    కృష్ణా: పామర్రు పోలీస్‌స్టేషన్ ఎస్సై వి.రాజేంద్ర ప్రసాద్, నిమ్మకూరు గ్రామంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ మోసాలు, అలాగే మోటార్ వాహన చట్టాలు గురించి విద్యార్థులకు విస్తృతంగా వివరించారు. చిన్న వయసులోనే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన విద్యార్థులకు సూచించారు.