Locations: Krishna

  • ‘రౌడీ షీటర్ల తీరు మారకుంటే చర్యలు’

    ఎన్టీఆర్: జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆదేశాలతో పోలీసు కమిషనరేట్ పరిదిలోని అన్నీ పోలీస్ స్టేషన్లు, టాస్క్ ఫోర్స్ అధికారులు రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్‌లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడనాడి, సత్ప్రవర్తనతో జీవించాలని, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా నిరోధించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిఘా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.

     

     

  • రేపూడిలో వ్యక్తి దారుణ హత్య

    ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం రేపూడి గ్రామ శివారులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ గ్రామానికి చెందిన కోట రాము(46)గా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హత్య జరిగినట్లు గుర్తించగా, మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • వైభవంగా కంచలమ్మ వరద పాయసం కార్యక్రమం

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో చెరువు కట్ట మీద వేంచేసియున్న కంచలమ్మ తల్లికి వరద పాయసం కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు స్థానిక కూటమి నేతలు, గ్రామ ప్రజలతో కలిసి వరద పాయసం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.

     

  • గాయత్రి అమ్మవారికి సారె సమర్పణ

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో గాయత్రి అమ్మవారి సారె కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిమంది మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. ఆషాడ మాసంలో నిర్వహించిన ఈ వేడుకలో వారాహి అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ సంస్కృతిని పరిరక్షించే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

  • ఘనంగా 50 యోగాసనాల విజయోత్సవ వేడుక

    కృష్ణా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాత్విక్ యోగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా 50రోజులు – 50యోగాసనాల కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సంద్భంగా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆదివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు అతిథుల చేతుల మీదుగా అవార్డులతో పాటు ప్రసంశాపత్రాన్ని అందజేశారు. అనంతరం యోగా గురువు గురువెల్లి కృష్ణను ఘనంగా సన్మానించారు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

  • ‘సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు’

    కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ రావు ఆదేశాలతో గుడివాడ సబ్-డివిజనల్ పోలీసు అధికారి ధీరజ్ వినీల్ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాస్ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

     

  • ‘ప్రజలకు మెరుగైన సేవలకు పెట్రోలింగ్ వాహనాలు’

    కృష్ణా: గన్నవరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి కొత్త పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేందుకే ఈ వాహనాలు తీసుకొచ్చామని తెలిపారు. ఈ వాహనాలు ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాల నివారణకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో డీజీపీ

    కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని డీజీపీ హరీశ్‌ గుప్తా కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు పూర్ణకుంభంతో డీజీపీకి స్వాగతం పలికారు. ముందుగా హరీష్ నాగపుట్టలో పాలు పోసి పూజలు చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతోపాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

  • ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్: షర్మిల

    కృష్ణా: రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మచిలీపట్నంలో పర్యటనలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ,జనసేన,వైసీపీలు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో ప్రజల కోసం పోరాడుతోందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్ర విభజనహామీలు నెరవేరతాయని ఆమె తెలిపారు.

  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానికి విరాళం.. ఎంతంటే..!

    కృష్ణా: మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిత్యాన్నదానం శాలకు దాతలు విరాళం అందజేశారు. సూర్యాపేటకి చెందిన దారం శిరీష వారి మొదటి నెల జీతం రూ.50వేలు (డ్రింకింగ్ వాటర్ ఫ్రిడ్జ్ రూ.39,000, రాగి వాటర్ జగ్గులు రూ.11,000) విరాళంగా అందించారు.