ఎన్టీఆర్: దేశంలోని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జులై 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం కామ్రేడ్ వెలగా లక్ష్మణరావు భవన్‌లో జరిగిన సీఐటీయు విస్తృత సమావేశం సందర్భంగా కార్మికుల హక్కుల పరిరక్షణకు సమ్మెలో పాల్గొనాలని సీఐటీయూ నాయకులు కోరారు.
Locations: Krishna
-
బురుగూడెంలో గొడ్డలితో వ్యక్తిపై దాడి
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెడ్డిగూడెం మండలం బురుగూడెం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొవ్వూరి మనోజ్ అనే వ్యక్తి గొడ్డలితో మట్టకొయ్య శ్రీనుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనును విజయవాడ ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణహాని ఉందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
-
నేరాల నియంత్రణకు 360 సీసీ టీవీ కెమెరాలు
ఎన్టీఆర్: విజయవాడ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రదేశాల సంరక్షణ కోసం డివైన్ సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. సురక్షా 360 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరాల నియంత్రణ, మహిళలకు భద్రత కల్పించేందుకు పశ్చిమలో రూ.30లక్షల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
-
నందిగామలో కనకదుర్గమ్మకు ఆషాఢ మాస బోనాలు
ఎన్టీఆర్: నందిగామ కనకదుర్గ నగర్‌లోని కనకదుర్గమ్మకు మహిళలు ఆషాఢ మాస బోనాలు సమర్పించారు. దాసరి సంఘం ఆధ్వర్యంలో ఏటా జూన్ చివరి ఆదివారం మహిళలు బోనాలు సమర్పిస్తుంటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మనబోతుల శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
-
వందల కుటుంబాల దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం
ఎన్టీఆర్: పేద కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటామని కేశినేని శ్రీదేవి మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ కేశినేని రమేష్ స్పష్టం చేశారు. విస్సన్నపేట మండలం తాత గుంట్ల హరిజనవాడలో 100పేద కుటుంబాలకు 26కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదల ఆర్థిక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వందల కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
-
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: వెలంపల్లి
ఎన్టీఆర్: విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో అదివారం 52వ డివిజన్ నుంచి ఇటీవల నూతనంగా నియమితులైన పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్లస్టర్‌లో వివిధ హోదాలలో పదవులు పొందిన నాయకులు మాజీ మంత్రి, పశ్చిమ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావుని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రసన్నకుమార్, సునీల్, సురేష్, నర్సిరెడ్డి, మేరీ, అప్పయమ్మలు. తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని వెలంపల్లి సూచించారు.
-
‘రేపటిలోగా ఆస్తి పన్ను చెల్లించండి’
ఎన్టీఆర్: వడ్డీ లేకుండా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చిందని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
-
స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ ప్రస్తుత స్టాండింగ్ కమిటీ పదవీకాలం జూలై 8తో ముగియనుండటంతో నూతన కమిటీ ఏర్పాటుకు కమిషనర్ ధ్యానచంద్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. కార్పొరేటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈనెల 29 నుంచి జూలై 7 వరకు నామినేషన్ల స్వీకరణ, 8న పరిశీలన, అదేరోజు జాబితా విడుదల, 11న ఉపసంహరణ, 17న పోలింగ్, అదేరోజు మధ్యాహ్నం లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
-
రేపూడిలో దారుణ హత్య
ఎన్టీఆర్: ఏ.కొండూరు మండలం రేపూడి శివారులో దారుణ హత్య జరిగింది. మృతుడిని రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ గ్రామానికి చెందిన కోటా రాముగా గుర్తించారు. తలపై బలంగా కొట్టడంతో మరణించిట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధం కారణంగా హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
కరెంట్ స్తంభాన్ని ఢీ కొన్న బస్సు.. తప్పిన ప్రమాదం
కృష్ణా: మొవ్వ మండలం నిడమోలులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు కరెంట్ స్తంభాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు అదుపుతప్పినట్లు పోలీసులు గుర్తించారు.