ఎన్టీఆర్: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతామని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన పార్టీ వైసీపీ అన్నారు. సొల్లు కబుర్లు కట్టిపెట్టి దుకాణం సర్దుకోండని ఎద్దేవా చేశారు. సింగయ్యను కారు టైరుతో తొక్కించి కనీస పశ్చాతాపం లేకుండా అబద్దాలతో విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.
Locations: Krishna
-
అసాంఘిక కార్యకలాపాలకు తావులేదు: CI చిట్టిబాబు
కృష్ణా: గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని సీఐ చిట్టిబాబు తెలిపారు. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో ఎస్సై అవినాష్‌తో కలిసి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి విక్రయాలు, సేవించడం వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ శివశంకర్, వైస్‌ప్రెసిడెంట్ శంకర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
-
‘లారీ యాజమానుల సమస్యలు పరిష్కరిస్తాం’
ఎన్టీఆర్: ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కలిశారు. క్రషర్ పరిశ్రమపై ఆధారపడి నడిచే పరిస్థితులు, పెట్రోల్ ధరలు, టోల్ గేట్ల వద్ద వేధింపులు, రోడ్ గ్రాంట్ల ఆలస్యం, ATS నెంబర్‌ల కారణంగా ఎదురవుతున్న సమస్యలను మంత్రికి లారీ ఓనర్లు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
-
నేడు దుర్గమ్మకు తెలంగాణ బోనం
ఎన్టీఆర్: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బోనం సమర్పించనున్నారు. హైదరాబాద్‌లోని శ్రీ భాగ్యనగర్ మహంకాళీ జాతర అమ్మవారి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. సుమారు 200 మందితో బేతాల నృత్యాలు, తీన్‌మార్ డప్పులతో తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఊరేగింపు జరుగుతుంది. ప్రతిఏటా ఆషాఢ మాసంలో బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ.
-
సుపరిపాలనలో తొలి అడుగు వేశాం: మంత్రి కొల్లు
కృష్ణా: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలకు సుపరిపాలనను అందిస్తున్నామని, సుపరిపాలనలో తొలి అడుగు వేశామని పేర్కొన్నారు. ‘తొలి అడుగు’ పేరుతో ఏడాది కాలంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించనున్నామని తెలిపారు.
-
‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’
కృష్ణా: కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ప్రధాని మోడీ పిలుపుమేరకు ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ కార్యక్రమంలో భాగంగా నందిగామ బీజేపీ, యవమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఈ కార్యక్రమంలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవ్వాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో యవమోర్చా నాయకులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘వారి తలరాతలను మార్చే శక్తి ఒక్క టీచర్‌కే ఉంది’
కృష్ణా: విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల HMలు, ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణ తరగతులను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను వారి తలరాతలను మార్చగలిగే శక్తి సామర్థ్యం ఒక్క టీచర్‌కే ఉంటుందన్నారు.
-
‘అభివృద్ధిని అడ్డుకోవడం సిగ్గుచేటు’
కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో కమిషనర్ బాపిరాజుపై వైసీపీ కార్పొరేటర్లు చేసిన నిందారోపణలను మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకు అవసరమైన అత్యవసర పనులకు నిధులు ఖర్చు చేస్తే దుర్వినియోగం చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం గర్హనీయమన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా నిందారోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
-
వారి సూచనల మేరకే విధులు నిర్వర్తిస్తున్నా: కమిషనర్
కృష్ణా: మచిలీపట్నం నగర మేయర్ పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని, పాలకపక్ష సభ్యుల సలహాలు, సూచనల మేరకే తాను విధులు నిర్వర్తిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేశానని మేయర్, పాలకపక్ష కార్పొరేటర్లు తనపై చేసిన ఆరోపణలపై కమిషనర్ స్పందించారు. 25 సంవత్సరాలుగా మున్సిపల్ కమిషనర్‌గా తాను ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు.
-
అందుకే డ్రైయిన్లపై ఆక్రమణల తొలగింపు: మంత్రి
కృష్ణా: మచిలీపట్నం నగరంలో మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.165కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం ఆయన మున్సిపల్ ఆఫీస్ పక్క రోడ్డులో రూ.35లక్షలతో డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడంలో భాగంగా డ్రైయిన్లపై ఆక్రమణలను తొలగించామన్నారు.