Locations: Krishna

  • మహిళా సాధికారతకు పెద్దపీట: ఎమ్మెల్యే

    కృష్ణా: గుడివాడలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆర్పీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి.. వారికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు. గుడివాడలో  ఉత్తమ డ్వాక్రా సంఘానికి రూ.5లక్షల వ్యక్తిగత ప్రోత్సాహక నగదును అందజేస్తామని రాము హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

  • రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

    కృష్ణా: కంకిపాడు మండలం కోమటిగుంటలాకు-తెన్నేరు రోడ్డుకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంఖుస్థాపన చేశారు. ఈ రోడ్ నిర్మాణం స్థానిక అభివృద్ధికి ఊతం ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • గ్రామాల అభివృద్ధికి దాతలు సహకరించాలి: MLA

    కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. లింగవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు రాయితీపై పశుగ్రాస విత్తనాలను అందజేశారు. గ్రామంలోని సాగునీటి కాలువలను పరిశీలించి, నీటి ప్రవాహానికి పూజలు చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

  • అవే.. చంద్రబాబు మానస పుత్రికలు: ఎంపీ

    ఎన్టీఆర్: మెప్మా, డ్వాక్రా.. సీఎం చంద్రబాబు మానస పుత్రికలు అని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. మెప్మాలో పనిచేసే రిసోర్స్‌ పర్సన్స్‌కు విజయవాడలో ట్యాబ్‌లు పంపిణీ చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లోని 500మందికి వీటిని అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మెప్మా, డ్వాక్రా బజార్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా తదితరులు పాల్గొన్నారు.

  • రేపు అగస్త్య పీఠంలో సారె సంబరాలు

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలోని అగస్త్య పీఠంలో వేంచేసి ఉన్న శ్రీగాయత్రి అమ్మవారికి ఆదివారం ఆషాడ మాస సారె కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సారెను అత్యంత వైభవంగా మేళ తాళాలతో వేలాదిమంది మహిళలతో ఊరేగింపుగా సమర్పిస్తారు. అనంతరం వారాహి అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు జరుగుతాయి. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం చేస్తారని అగస్త్య పీఠం పీఠాధిపతి శ్రీసుగుణానంద గాయత్రిస్వామి
    శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • తానా సభలకు హాజరైన MLA సౌమ్య

    అమెరికాలో తానా, నాట్స్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగుమహసభలకు నందిగామ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ తానా అధ్యక్షులు వేమన సతీష్ దంపతుల ఆహ్వానం మేరకు వర్జీనియాలో వారి స్వగృహానికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుటుంబ సభ్యులు, నందిగామ నియోజకవర్గ ప్రవాసాంధ్రులు తదితరులు పాల్గొన్నారు.

  • MLA సౌమ్యకు అమెరికాలో సత్కారం

    ఎన్టీఆర్: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అమెరికాలో ప్రవాస భారతీయులు ఘన సత్కారం చేశారు. ఆమె విద్యార్హత, రాజకీయ వారసత్వం, ప్రజాసేవను తానా మాజీఅధ్యక్షులు సతీష్ వేమన, గుంటూరు మిర్చియార్డ్ మాజీఛైర్మన్ మన్నవ సుబ్బారావు అభినందించారు. రాష్ట్ర ప్రగతికి యువ ఎమ్మెల్యేల కృషి అవసరమని ప్రవాసులు తెలిపారు. సౌమ్య మాట్లాడుతూ..రాష్ట్రప్రగతికి ప్రవాసులు, ఇక్కడ తాము కలిసి పనిచేయాలని, ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

  • గంపలగూడెం మండల సర్వసభ్య సమావేశం

    ఎన్టీఆర్: గంపలగూడెంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. జడ్పీటీసీ కోట శామ్యూల్, ఎంపీడీవో నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అధికారులు తెలిపారు.

     

  • కార్మిక మహాసభ విజయవంతం చేయండి

    ఎన్టీఆర్: బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ జిల్లా మహాసభ జయప్రదం చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మైలవరం మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు,  వెంకటేశ్వరరావులు కోరారు. ఈ నెల 30వ తేదీ రామవరప్పాడులో జరుగు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ జిల్లా మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ శనివారం భవన నిర్మాణ కార్మికుల పని ప్రదేశాలలో కరపత్రాలు పంపిణీ చేశారు.

  • గుంటూరులో దీన స్థితిలో సీనియర్ నటి పాకీజా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు రిక్వెస్ట్!

    AP:పూటగడవక దీనస్థితిలో ఉన్నానని అలనాటి నటి పాకీజా(వాసుగి) తెలిపారు. పొట్టకూటి కోసం భిక్షాటనచేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న డబ్బును అమ్మ క్యాన్సర్ చికిత్సకు ఖర్చు చేశానన్నారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు ఆమె గుంటూరు వచ్చారు. ‘నా దుస్థితి గురించి తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. గతంలో చిరు, నాగబాబు ఆదుకున్నారు. తనకు పెన్షన్ ఇవ్వాలి’అని కోరారు.