ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన భార్గవి కూతురు కీర్తి చంద్రిక (12) వెన్నుపూస వ్యాధితో బాధపడుతోంది. ఆపరేషన్ ఖర్చుల కోసం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును సంప్రదించగా, ఆయన చొరవతో రూ.5 లక్షల LOC చెక్కును వైద్య ఖర్చుల కోసం అందించారు.
Locations: Krishna
-
నాగేశ్వరరావును పరామర్శించిన టీడీపీ నేతలు
ఎన్టీఆర్: విస్సన్నపేట వైభవ్ జ్యుయలరీ అధినేత, తిరువూరు ఏఎంసీ వైస్ ఛైర్మన్ కుక్కడపు వెంకట నాగేశ్వరరావు మాతృమూర్తి ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శనివారం నాగేశ్వరరావును పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
-
దుర్గగుడి సమగ్రాభివృద్ధికి ప్లాన్
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిని రూ.100కోట్లతో అభివృద్ధి చేసేందుకు విజన్ 2029లో భాగంగా ప్రణాళిక సిద్ధమైంది. భక్తుల సౌకర్యాలే కేంద్రంగా ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం సరైన మార్గం లేదు. పార్కింగ్ సమస్యలు, కాటేజీల కొరత సహా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా తాజాగా ప్లాన్ రెడీ చేశారు.
-
ఎమ్మెల్యేను కలిసిన ఐసీడీఎస్ అధికారులు
ఎన్టీఆర్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో ICDS శాఖకు కొత్తగా నియమితులైన CDPO కృష్ణ కుమారి, సూపర్‌వైజర్ గౌస్య బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శాఖాపరమైన విషయాలపై చర్చించారు.
-
రేపు జిల్లా అండర్-15 చెస్ పోటీలు.. ఎక్కడంటే?
ఎన్టీఆర్: విజయవాడలో ఈ నెల 29వ తేదీ జిల్లా స్థాయి అండర్-15 చదరంగ పోటీలు నిర్వహిస్తామని ది విజయవాడ చెస్ సంఘం అధ్యక్షులు అక్బర్ పాషా తెలిపారు. ఈ పోటీల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన బాలబాలికలకు వేర్వేరుగా నగదు పారితోషకంతోపాటు వ్యక్తిగత పతకాలు, ధ్రువపత్రాలు బహూకరిస్తామన్నారు. అదే విధంగా వీరిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9030308811లో సంప్రదించాలన్నారు.
-
‘వన్ వేలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడొద్దు’
ఎన్టీఆర్: వన్ వేలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడొద్దని ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు సూచించారు. మండల పరిధిలోని మూలపాడులో గ్రామస్థులకు రహదారి భద్రతపై సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వన్ వేలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
కృష్ణా: పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించడంపై ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ప్రశంసిస్తూ, విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంచలన మార్పులు తీసుకువచ్చారని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
-
తరకటూరులో ‘పొలం పిలుస్తోంది’
కృష్ణా: గూడూరు మండలం తరకటూరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద మండల వ్యవసాయ అధికారి శివ రామకృష్ణ ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల పొలాలకు క్షేత్ర సందర్శనతో పాటు, పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులకు సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, ఉత్పాదకత పెంచేందుకు సలహాలు అందించారు.
-
మాలలపై దాడి.. సీఎం స్పందించాలి: ఉప్పులేటి
పశ్చిమ గోదావరి: అత్తిలి మండలం ఆరవల్లిలో మాలలపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని RPI రాష్ట్ర అద్యక్షులు ఉప్పులేటి దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మాల ఐక్యవేదిక, మాలసేన, దళిత ప్రజా సమితి తదితర సంఘాల నాయకులతో కలిసి దేవీప్రసాద్ పరామర్శించారు. FIRలో ముప్పిడి ప్రతాప్‌ను A1 గా చేర్చాలన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, స్పందించాలని కోరారు.
-
మాలలకు అండగా నేనున్నా: దేవీ ప్రసాద్
పశ్చిమ గోదావరి: అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో మాలలపై మాదిగలు చేసిన దాడిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(BA) రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను దేవీప్రసాద్ శుక్రవారం పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.