కృష్ణా: పామర్రు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నియోజకవర్గ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో ముందుగా ఎమ్మెల్యే దంపతులు కేక్ కట్ చేసి అనంతరం భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పామర్రు మండల అధ్యక్షులు గుంప గంగాధరరావు, రాపర్ల ఎంపీటీసీ సభ్యులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ అవ్వాలి: ఎంపీ
ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ అవ్వాలని సీఎం చంద్రబాబు ఆశ అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాప్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు హయాంలో క్రీడాలకు సంబంధించిన మంచి స్టేడియాలు నిర్మించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయబట్టే ప్రముఖ అకాడమీలు స్థాపించారన్నారు. సాప్ ఛైర్మన్ రవి ఆధ్వర్యంలో క్రీడా రంగం ముందుకువెళ్లాలని ఎంపీ ఆకాంక్షించారు.
-
సీఎం చంద్రబాబు విజనరీ లీడర్: మంత్రి
ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అంటే విజనరీ లీడర్ అని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రీడాకారూలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నడూ లేని విధంగా DSCపోస్టులు రిలీజ్ చేస్తే వాటిలో అత్యధికంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రానున్నాయని, కూటమిప్రభుత్వం ఏర్పడ్డాక క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
-
‘ప్రజా ఆరోగ్యమే ప్రాధాన్యం’
ఎన్టీఆర్: రాష్ట్ర ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశానుసారం స్వచ్ఛ నందిగామ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక 10వ వార్డులో సీఎం రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కాలువల పూడికతీత పనులను నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పరిశీలించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, మురుగునీటి సమస్య నివారణే ధ్యేయంగా ఈ పనులు జరుగుతున్నాయని కృష్ణకుమారి అన్నారు.
-
‘ఆ చరిత్రాత్మక పోరాటమే.. మొహర్రం’
ఎన్టీఆర్: ప్రజాస్వామ్యం కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం ‘మొహర్రం’ అని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. ఇస్లాం నూతన సంవత్సరం మొహర్రం పండుగ సందర్భంగా షాబూఖారీ లంగర్ ఖానాలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఛైర్మన్, వైస్ చైర్మన్లు శ్రీనివాస్, శ్రీలక్ష్మి హాజరయ్యారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
-
‘పార్టీ బలోపేతం కోసం సంస్థాగత సమావేశాలు’
ఎన్టీఆర్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సంస్థాగతంగా నియోజకవర్గంలోని డివిజన్‌ల నూతన కమిటీలను ఎన్నిక చేసేటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్ నాయకత్వ ఎంపికతో పార్టీని బలోపేతం చేయడమే కాక, అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని బలోపేతానికి పార్టీని నిర్మాణాత్మకంగా చేసుకునేందుకు ఈ సంస్థాగత సమావేశాలు పూర్తిస్థాయిలో ఉపయోగపడతాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
-
MLA రాజాకు సీఐ చిట్టిబాబు బర్త్ డే విషెస్
కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని పోలీసు సిబ్బంది రాజాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పమిడిముక్కల మండల సీఐ చిట్టిబాబు, పామర్రు ఎస్సై వెంకట్ తదితరులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.
-
రక్తదానం చేయడం ఒక గొప్ప సేవ: MLA
ఎన్టీఆర్ : జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో ఉన్న Cohance ఫార్మా కంపెనీలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ఒక గొప్ప సేవ అని, మన రక్తంతో ఎవరో ఒకరి ప్రాణాలు నిలబడతాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
-
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 30న నందిగామలో జాబ్ మేళా
ఎన్టీఆర్: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 30న నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారని కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ బాబు తెలిపారు. 18-35 ఏళ్ల మహిళలు, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హులన్నారు. రూ.10,000-30,000 వేతనం, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. నమోదుకు https://naipunyam.ap.gov.in/user లింక్‌లో రిజిస్టర్ చేసి, బయోడేటా, ఆధార్ కాపీలతో హాజరుకావాలన్నారు.
-
‘పశుసంవర్ధకం ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక’
కృష్ణా: తిరుపతి శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, జాతీయ మాంస పరిశోధన సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గన్నవరంలో రైతు సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పశుసంవర్ధకం ప్రాముఖ్యతను గురించి వివరించారు. పశువుల ఆరోగ్యానికి వైద్య పరీక్షలు అవసరమని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్ పశుసంవర్ధకం మన ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు.