Locations: Krishna

  • ‘ఆ విధానంతో ట్రాన్స్‌పోర్ట్ రంగం కుదేలు’

    ఎన్టీఆర్: ట్రాన్స్‌పోర్ట్ రంగాన్ని కూటమి ప్రభుత్వం కుదేలు పరుస్తుందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆటో ఫిట్‌నెస్ స్టేషన్స్(ATS) నూతన విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 10వేల వాహనాలుంటే ఆ వాహనాలు ఫిట్నెస్ కోసం తీసుకెళ్తే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు మొత్తం సామాన్యుడిపై పెనుభారం పడుతుందన్నారు.

     

  • మచిలీపట్నం నగర కమిషనర్‌పై ఫిర్యాదు

    కృష్ణా: మచిలీపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ బాపిరాజుపై వైసీపీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేశారు. కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ నాయకత్వంలో వైసీపీ కార్పొరేటర్లు కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • రోడ్లపై ఆవులు.. చోదకుల అవస్థలు

    ఎన్టీఆర్: విస్సన్నపేట పట్టణంలో ప్రధాన రహదారిపై, అన్ని సెంటర్ల కూడలిల్లో ఆవులు, దూడలు సంచరిస్తున్నాయి. రహదారి ప్రక్కన డివైడర్ పక్కన ఉండటం వలన వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారింది. గతంలో ప్రమాదాలు కూడా సంభవించిన విషయం విధితమే. గతంలో ఆవులను గేదెలను బందెల దొడ్డి బజారులో ఉంచేవారు. గ్రామపంచాయతీ వారు ఇప్పటికైనా చొరవ తీసుకొని అందుబాటులో ఉన్న గోశాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

     

  • మోప్మా అర్బన్ మార్కెట్ స్టాల్స్ ప్రారంభం

    ఎన్టీఆర్: రాష్ట్ర ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశానుసారం నందిగామలోని గాంధీ సెంటర్‌లో మెప్మా సంస్థ ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలతో కలిసి ఈ స్టాల్స్‌ను ప్రారంభించారు.

  • రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

    కృష్ణా: మచిలీపట్నం పార్లమెంట్ పరిథిలో ఆరు ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జ్)ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ROBల కోసం ఎంపీ బాలశౌరి చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి. రూ.350కోట్లతో ఆరు ROBల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎంపీ తెలిపారు. చిలకలపూడి, గుడ్లవల్లేరు, ఉప్పలూరు, నిడమానూరు, పొట్టిపాడు, వేలేరు రైల్వే స్టేషన్ల పరిథిలో ROBల నిర్మాణం చేయనున్నారు.

  • మచిలీపట్నంలో మందుబాబుల వీరంగం!

    కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో గురువారం అర్థరాత్రి మందుబాబులు హల్‌చల్ చేశారు. మద్యం సేవించిన నలుగురు యువకులు ఆసుపత్రి క్యాజువలిటి వద్ద పెద్ద పెద్ద కేకలు వేస్తూ అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన వారిపై దౌర్జన్యం చేశారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో మందుబాబులు ఆస్పత్పిలోకి ప్రవేశించి వీరంగం చేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

  • సుజనా చౌదరిని కలిసిన విష్ణుకుమార్ రాజు

    విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. మే నెలలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి కోలుకున్న ఆయన విజయవాడ రావడంతో తాడిగడపలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, పలు అంశాలపై ఇరువురు చర్చించారు.

  • రవాణా శాఖ నిర్లక్ష్యం.. బస్సుల తనిఖీలు శూన్యం

    ఎన్టీఆర్: కంచికచర్లలో కొన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులు కండిషన్లో లేకుండా నడుపుతున్నారు. ఒక ఇంజనీరింగ్ కళాశాల బస్సు వెళుతుంటే నల్లటి పొగ చుట్టుపక్కల కమ్ముకుంటుంది. మరో పాఠశాల బస్సు వెళుతుంటే రనగన ధ్వనులు వినిపిస్తాయి. ఇలాంటి బస్సుల వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు అన్ని బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

     

  • గన్నవరం అభివృద్ధికి నూతన శకం: యార్లగడ్డ

    కృష్ణా: గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గన్నవరం రూపురేఖలు మారుస్తామన్నారు. మల్లవల్లి, వీరప్పనేనిగూడెంలలో పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో దేశం, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

     

  • YCP నాయకులకు ధైర్యాన్నిచ్చిన మాజీ ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు వైసీపీ నాయకులను పరామర్శించారు. గొట్టుముక్కలలో ఆలోకం శ్రీను నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.