Locations: Krishna

  • ప్రాణాలు కోల్పోయినా పరిహారం ఇవ్వరా?

    ఎన్టీఆర్: మైలవరంలో భూములు కోల్పోయిన కుటుంబాలు రోడ్డెక్కాయి. మండలంలోని చంద్రాలలో సీపీఐ ఆధ్వర్యంలో భూములు కోల్పోయిన కుటుంబాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. మైలవరం, నూజివీడు ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇళ్ల స్థలాలు, ప్రాణాలు కోల్పోయినా తమకు పరిహారం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

  • తిరువూరు AMC నూతన డైరెక్టర్‌కు MP విషెస్

    ఎన్టీఆర్: తిరువూరు AMC నూతన డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అబ్బినేని బాబుకు ఎంపీ కేశినేని చిన్ని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకురాలు పోలే శాంతి పాల్గొన్నారు.

  • రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

    కాకినాడ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఆగస్టు 26, 28, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టాల మరమ్మతుల కారణంగా 12717-12718, 67285, 22875-22876, 17267-17268 నంబర్ల రైళ్లు రద్దు కానున్నాయని వివరించారు. దీనికి అనుగుణంగా ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని సూచించారు.

  • సీపెట్‌లో ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం

    ఎన్టీఆర్: విజయవాడలోని కేంద్ర పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)‌ టెన్త్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు అర్హులైన విద్యార్థులు జూలై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7893586494 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

  • కొలికపూడికి శుభాకాంక్షలు తెలిపిన రఘు

    ఎన్టీఆర్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భముగా నేడు టీడీపీ సీనియర్ నాయకుడు కంచి రఘు ప్రవీణ్ ( బాబీ) ఎమ్మెల్యే కార్యాలయంలో కొలికపూడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కంచి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలని ప్రవీణ్ ఆకాంక్షించారు.

     

     

     

  • IIITలో ఆ నలుగురు!

    ఎన్టీఆర్: కొండపల్లి జడ్పీ బాలికల హైస్కూల్‌ పదో తరగతిలో ఉత్తీర్ణులైన నలుగురు విద్యార్థినులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. దేవరకొండ జ్యోత్స్న (నూజివీడు), చట్టు వెంకట భార్గవి (ఒంగోలు), బండి యశ్విని (నూజివీడు), ఎం.నాగమనస్విని (ఇడుపులపాయ) ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఈసందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి ప్రధానోపాధ్యాయురాలు బి.హేమలత జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.

  • స్సూల్ బస్సుల భద్రతా తనిఖీలు

    ఎన్టీఆర్: పాఠశాల బస్సుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్ బోస్కో హైస్కూల్ బస్సులను ట్రాఫిక్ ఆర్ఎస్సై బి.లక్ష్మణరావు తనిఖీ చేశారు. బస్సుల ఫిట్‌నెస్, పర్మిట్, ఆర్‌సీ, లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, మంటలు ఆర్పే పరికరాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

     

  • కొండపల్లి మున్సిపాలిటీకి రూ.80.61 లక్షల పన్నులు

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీకి పారిశ్రామికవాడ నుంచి రూ.80.61లక్షల పన్నులు లభించాయి. ఈ మేరకు ఐలా ప్రతినిధులు 35శాతం నగదు చెక్కును మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, ఛైర్మన్ చిట్టిబాబుకు అందజేశారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలపై పాలకవర్గం దృష్టి సారించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 జనవరి 31 వరకు ఐలా నుంచి 35శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. కార్యక్రమంలో ఐలా కార్యదర్శి కృష్ణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

     

  • ప్రేమపేరుతో బాలికపై మైనర్ అత్యాచారం

    కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్‌పై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన బాలిక(16) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె ఇంటి సమీపంలో ఉండే మైనర్ ప్రేమపేరుతో బాలికకు మాయమాటలు చెప్పి ఈనెల 23న అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గమనించి తల్లి ప్రశ్నించగా..జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • 50వేల ఓట్ల తేడాతో ఓడినా మార్పు రాలేదు: బండి

    కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదని DCMS ఛైర్మన్ బండి రామకృష్ణ పేర్కొన్నారు. మచిలీపట్నంలో మాజీమంత్రి పేర్నిపై రామకృష్ణ తీవ్రవిమర్శలు చేశారు. ‘’సుపరిపాలనలో తొలిఅడుగు’ సమావేశంలో పవన్ ప్రసంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు తగదు. నువ్వు పేదల బియ్యాన్ని అమ్మేసుకున్న అవినీతిపరుడివి. 50వేల ఓట్ల తేడాతో ఓడినా మార్పు రాలేదు’ అని బండి ఎద్దెవా చేశారు.