Locations: Krishna

  • వృద్దుడిపై మహిళా కండక్టర్ దాడి.. వీడియో వైరల్!

    AP: కృష్ణా జిల్లా ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ మహిళా కండక్టర్‌ వృద్ధుడిపై దాడి చేసింది. తోట్లవల్లూరులో బస్సు ఎక్కిన పెద్దిబోయిన మల్లిఖార్జునరావు రూ.200 నోటు ఇవ్వడంతో చిల్లర విషయంలో ఇరువురు గొడవపడ్డాడు. పెద్ద నోటు ఇచ్చావని ఆగ్రహించిన కండక్టర్‌, వృద్ధుడిని బస్సులోంచి దింపి దుర్భాషలాడుతూ దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

     

  • జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పబ్లిక్ స్కూల్‌లో బాలబాలికల జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలను నిర్వహించినట్లు జిల్లా ఫెన్సింగ్ సామాఖ్య కార్యదర్శి సతీష్‌బాబు తెలిపారు. ముఖ్యఅతిథిగా పాఠశాల ఫౌండర్, డైరెక్టర్ డా. అమరనేని మనోజ్ పాల్గొన్నారు.  ఎంపికైన వారు ఈనెల 29వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని డీఎస్సీ ఇండోర్ హాల్లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

  • నేడు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో CM పర్యటన

    సీఎం చంద్రబాబు శుక్రవారం 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడలో జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం గుంటూరుకు బయలుదేరుతారు. ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజీలో జరిగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పల్నాడుకు బయలుదేరుతారు. యడ్లపాడు మండలం కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలిస్తారు.

  • కృష్ణా కెనాల్‌-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్‌!

    AP : విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్‌ నిర్మాణానికి త్వరలోనే కేంద్రం నుంచి ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా కెనాల్‌-గుంటూరు మధ్య మూడోలైన్‌ ఏర్పాటుకు సర్వే పూర్తయింది. దీనికి తుది సర్వే పూర్తిచేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(DPR)ను దక్షిణమధ్య రైల్వేకు అందించారు. అక్కడ పరిశీలన అనంతరం రైల్వేబోర్డు ఆమోదం కోసం పంపారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1,200కోట్లు అవుతుందని అంచనా.

  • వాషింగ్టన్ డీసీలో MLAకు ఘన స్వాగతం

    ఎన్టీఆర్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న 24వ తానా కాన్ఫరెన్స్ ఉత్సవాలు, 8వ NATS సంబరాల్లో పాల్గొనేందుకు గురువారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వాషింగ్టన్ డీసీ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు తెలుగు ఎన్నారైలుఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, తానా వైస్ ప్రెసిడెంట్ క్యాపిటల్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

  • డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం: విజయవాడ కమిషనర్‌

    ఎన్టీఆర్: డ్రగ్స్ రహిత సమాజం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. మాదకద్రవ్యాలు సరఫరా చేసే, విక్రయించే వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి కటకటాల వెనక్కి పంపుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో భాగంగా విజయవాడలోని భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడితేనే మంచి సమాజం సాధ్యమవుతుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.

     

  • ‘యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో జీడీఎంఎం నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నందిగామ సీనియర్ సివిల్ జడ్జ్ సత్యలక్ష్మీ ప్రసన్న ముఖ్యఅతిథిగా పాల్గొని యువత చెడు అలవాట్లకు బానిసై వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని, వాటి దూరంగా ఉండాలని సూచించారు.

  • ఇంటింటికీ రేషన్ పంపిణీ పరిశీలన

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని అశోక్ నగర్, కాకాని నగర్‌లో 65 సంవత్సరాల పైబడిన రేషన్ కార్డుదారులైన వృద్ధులకు ఈనెల 26 నుంచి 30వ తేదీ లోపు జులై నెలకు సంబందించిన రేషన్ పంపిణినీ ఆర్డీఓ బాలకృష్ణ పరిశీలించారు. వారితో పాటు నందిగామ తహసీల్దార్ సురేష్ బాబు, సివిల్ సప్లయ్స్ డిప్యూటీ తహసీల్దార్ రమణమూర్తి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • ఎన్నో ఎళ్లకు.. పూడిక తీత!

    కృష్ణా: కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగంగా పెదయాదర సర్పంచ్, జనసేన మచిలీపట్నం మండల అధ్యక్షులు గళ్ళా తిమోతి ఆధ్వర్యంలో బందరు మండలం ఎన్.గొల్లపాలెం వ్యవసాయ మురుగు బోదు పూడిక తీత పనులు మొదలయ్యాయి. గత 15సంవత్సరాలుగా పూడిక తీత నోచుకోని ఈ డ్రెయిన్‌కు నేటి కూటమి నాయకత్వంలో పనులు జరుగుతుందటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • కారుణ్య నియామకంలో ఉదయ్ కిరణ్‌కు ఉద్యోగం

    కృష్ణా: గ్రంథాలయ సంస్థలో పనిచేస్తూ మరణించిన దాసరి శ్యాంసుందర్ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. విజయవాడ మధురానగర్ శాఖా గ్రంథాలయంలో ఆయన చివరి తరగతి ఉద్యోగిగా నియమితులయ్యారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ,  ఈ నియామక పత్రాన్ని కిరణ్‌కు అందజేశారు.