Locations: Krishna

  • జిల్లా పోలీసులకు కొత్త వాహనాలు..!

    కృష్ణా: జిల్లా పోలీస్ శాఖకు మూడు బొలెరో వాహనాలను లిఖిత ఇన్ఫ్రా అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు ఐజీ అశోక్ కుమార్ చేతుల మీదుగా బహూకరించారు. అలాగే ట్రాఫిక్ పెట్రోలింగ్ కోసం 15మోటార్ సైకిళ్లను ఐజీ, ఎస్పీ గంగాధర్‌తో కలిసి ప్రారంభించారు. అవనిగడ్డ నియోజకవర్గానికి 9బొలెరో వాహనాలు సమకూర్చిన శ్రీనివాసరావును ఐజీ, ఎస్పీలు సత్కరించారు. గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ ప్రకటించారు.

  • ఆకట్టుకున్న డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు ర్యాలీ

    కృష్ణా: డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు అంటూ అధికారులు, విద్యార్థుల నినాదాలతో నిర్వహించిన ర్యాలీ ఘంటసాలలో ఆకట్టుకుంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం ఘంటసాల ఎస్సై ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పానీయాలు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు.

  • ‘పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు’

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీలో పశువైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో గొర్రెలు, మేకలకు నట్టుల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ అఫ్సర్, నందిగామ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవాలకు సంవత్సరంలో రెండుసార్లు నట్టుల మందులు ప్రభుత్వం వారు ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు.

  • మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలిస్తేనే..

    ఎన్టీఆర్: మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలిస్తేనే రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధి సాధ్యపడుతుందని సీఐ చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం సందర్భంగా గురువారం పోలీసుల ఆధ్వర్యంలో హైస్కూల్ నుంచి నూజివీడు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

     

  • గుడివాడలో వ్యభిచార గృహంపై దాడి.. మహిళ అరెస్ట్

    కృష్ణా: గుడివాడలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. లక్ష్మీ నగర్ కాలనీలో ఈ దందా జరుగుతున్నట్లు గుడివాడ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. రూరల్ ఎస్‌ఐ నంబూరి చంటి బాబు సిబ్బందితో కలిసి దాడి చేశారు. గృహ నిర్వాహకురాలు కోరాడ శివకుమారిని అరెస్ట్ చేశారు. ఒక బాధిత మహిళను రక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.

  • ‘ఇంకా అందరికీ పుస్తకాలు అందలేదు’

    ఎన్టీఆర్: నందిగామలో విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించాలని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్ డిమాండ్ చేశారు. నందిగామ తహశీల్దార్‌కి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు తెరిచి చాలా రోజులు అయినా, ఇంకా అందరికీ పుస్తకాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, టీచర్ పోస్టులను భర్తీచేయాలని వారు కోరారు.

  • ‘డిజిటల్ పరిపాలనలో ట్యాబ్స్ కీలక పాత్ర’

    ఎన్టీఆర్: రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశానుసారం మెప్మా సంస్థ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్‌లకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి మాట్లాడుతూ.. డిజిటల్ పరిపాలనలో ట్యాబులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ ట్యాబులు ద్వారా మహిళా సాధికారత, డిజిటల్ అక్షరాస్యత పెరుగుతాయని ఆమె తెలిపారు.

  • ‘ప్రయాణంలో జర భద్రం’

    ఎన్టీఆర్: నిబంధనలకు విరుద్ధంగా కొంత మంది వాహనదారులు పరిమితికి మించి ప్రయాణిస్తూ తమతో పాటు ఇతర ప్రయాణీకుల భద్రతకు సవాల్ విసురుతున్నారు. కంచికచర్ల నెహ్రు సెంటర్ వద్ద టీవీఎస్‌పై ఆరుగురు ప్రయాణిస్తూ కనిపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదుపు తప్పితే అంతే సంగతులు.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వాహనదారులు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టరాదని సూచిస్తున్నారు.

  • ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

    కృష్ణా: పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు మండలం ఆకుమర్రు గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొల్లా రాజేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పెడన అమ్మ ఫుడ్ ఫౌండేషన్‌లో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోపి నాగబాబు, జనసేన నాయకులు వన్నెంరెడ్డి సాయి కిరణ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • రాష్ట్రంలో అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయి: షర్మిల

    ఎన్టీఆర్: కాంగ్రెస్ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నట్లు విజయవాడలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయని, అన్ని పార్టీలు మోదీ జపంలో ఉన్నాయని విమర్శించారు. జగన్ మోదీకి దత్తపుత్రుడిలా మారారని, రైతులకు న్యాయం చేయలేదని, మధ్య నిషేధం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ను సమర్థించడాన్ని తప్పుబట్టారు.