కృష్ణా: హైదరాబాదులో ఆగస్టు 23న టెక్ మహీంద్రా నిర్వహించిన ఇంటర్వ్యూలలో అవనిగడ్డ శ్రీవివేకానంద డిగ్రీ కాలేజీ నుంచి జయశ్రీ, రేణుశ్రీ, సుచిత్ర పాల్గొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించారు. నవంబర్‌లో వీరు జాయిన్ కానున్నారు. గ్రామీణ పేద కుటుంబాల నుంచి వచ్చి ఈ విజయం సాధించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ పెమ్మసాని రమేష్ బాబు, కరస్పాండెంట్ యార్లగడ్డ శివప్రసాద్, హెడ్‌పీ శంకర్రావు, అధ్యాపక బృందం అభినందించారు.
Locations: Krishna
-
‘ప్రభుత్వానికి చెడ్డపేరు రానివ్వొద్దు’
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలోని శ్రీకాకుళం PACSకు యూరియా ఎరువు చేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల కీలక దశలో యూరియా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, ఆలస్యమైతే నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై టీడీపీ నేత, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు(చిన్నా) సంబంధిత అధికారులతో ఫోన్‌లో సంప్రదించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రానివ్వకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని తెలిపారు.
-
కృత్తివెన్నులో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు
కృష్ణా: బంటుమిల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కృత్తివెన్నులో జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పోషక విలువలు గల ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మునగాకు పౌడర్ తయారుచేసే విధానాన్ని ప్రదర్శించారు. కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఝాన్సీ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
పర్యావరణ పరిరక్షణలో ఎమ్మెల్యే శ్రీరాం
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పరిసర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ముందుగా గణపతి నవరాత్రులలో భాగంగా పూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు.
-
యూరియా కొరతతో రైతులకు తప్పలు
ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గంలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. చిల్లకల్లు సహకార రైతుసేవా కేంద్రాల్లో ఎరువుల స్టాక్ తక్కువగా ఉంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలసాగు తగ్గినా..ఎరువుల అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరగడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మార్క్‌ఫెడ్ వైఫల్యం ఉందని, ఎరువులు పక్కదారి పడుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
-
ఆకర్షించిన గణనాథులు.. 350కేజీల..!
ఎన్టీఆర్: విజయవాడ టీచర్స్ కాలనీలో ఫన్ టైమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి 350 కేజీల లడ్డూను బహూకరించారు. రూ.1.5లక్షల విలువైన ఆ లడ్డూలో 10కేజీల చొప్పన బాదం పప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌లు వినియోగించినట్లు ప్రముఖ మిఠాయి సంస్థ యజమానులు తెలిపారు. లడ్డూపై చిత్రించిన వినాయకుడి బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
-
6 బార్లకు రీ నోటిఫికేషన్
కృష్ణా: మచిలీపట్నం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 6 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి జి.గంగాధరరావు వెల్లడించారు. ప్రతి దరఖాస్తుదారుడు ఫీజుగా రూ.5లక్షలు, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.10వెేలు చెల్లించాలని సూచించారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9440902441, 8247827255 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
-
వైసీపీ మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా..!
ఎన్టీఆర్: వైసీపీ మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్ జియావుల్‌హక్‌ను నిమమిస్తూ..పార్టీ కేంద్ర కార్యాలయం ఓప్రకటన విడుదల చేసింది. పార్టీ ప్రారంభం నుంచి జియవుల్ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ సేవలందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ బాధ్యతలప్పగించారు. తనకు పదవి రావడానికి కారణమైన వైసీపీ అధినేత జగన్, వెైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జోగి రమేష్‌కు జియావుల్ ధన్యవాదాలు తెలిపారు.
-
‘ఛాయ్ పే చర్చ’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కృష్ణా: మచిలీపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని మచిలీపట్నం అభివృద్ధికి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన పోర్టు నిర్మాణంతో పాటు డ్రెయినేజీ, తాగునీటి సమస్యను పరిష్కారిస్తానని మాధవ్ హామీ ఇచ్చారు.
-
వరదొస్తే.. ఆ దారి సంగతి అంతే..!
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల చెరువుకు వరద వచ్చినప్పుడల్లా మద్దులమ్మ డొంక దారిపై నీరు చేరి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఈ మార్గంలో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధాన దారి నుంచి డొంక దారికి చప్టా నిర్మించాలని ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా..ఫలితం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.