Locations: Krishna

  • విజయవాడలో ఉచిత మెగా వైద్య శిబిరం

    ఎన్టీఆర్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక టీడీపీ కార్యాలయం వద్ద ‘హెల్త్ ఫర్ ఆల్’ అనే నినాదంతో ఒమేగా అను హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.

  • ఇన్‌ల్యాండ్ వాటర్‌వేలు రాష్ట్రాభివృద్ధికి కీలకం: మంత్రి

    ఎన్టీఆర్: విజయవాడలోని నోవా హోటల్‌లో ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్ అథారిటీ(APIWA) ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేలు తక్కువ ఖర్చుతో, కాలుష్యరహితంగా రాష్ట్రాభివృద్ధికి కీలకమని తెలిపారు. ఏపీ ఏటా 8మిలియన్ టన్నుల సరుకును జలమార్గాల ద్వారా తరలిస్తోందన్నారు. ఏపీ లాజిస్టిక్స్ రంగంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వే సెక్టార్‌లో ప్రైవేట్ రంగం క్రియాశీల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

  • ‘ఆయిల్ పామ్ సాగుతో.. రైతులకు లాభం’

    ఎన్టీఆర్: నందిగామ మండలం కంచల గ్రామంలో ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ నెట్టెం రఘురాం హాజరయ్యారు. పతంజలి ఫుడ్స్ డీజీఎం వీరేంద్రచౌదరి మాట్లాడుతూ..ప్రస్తుతం రైతులకు లాభదాయకమైన పంట ఆయిల్ పామ్ అని అన్నారు. ఉద్యానశాఖ అధికారులు ఆయిల్‌పామ్ పంటకు సాగువిధానం,సబ్సిడీ గురించి తెలిపారు.

  • ‘మత్తు.. ఒక మహావిపత్తు’..!

    కృష్ణా: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు మచిలీపట్నంలో 22వ డివిజన్‌లో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. పాఠశాలలకు వెళ్లకుండా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న పిల్లలకు అవగాహన కల్పించారు. మత్తు.. ఒక మహావిపత్తు అని, డ్రగ్స్ అలవాటు పడవద్దని సూచించారు. కార్యక్రమంలో 22వ డివిజన్ టీడీపీ ఇన్‌ఛార్జ్ కుంభ రవి కిరణ్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • కలెక్టర్‌ను కలిసిన యూనియన్ బ్యాంక్ డైరెక్టర్

    కృష్ణా: మచిలీపట్నం యూనియన్ బ్యాంక్ డైరెక్టర్(RSETI) బి.స్వర్ణ గురువారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని ఛాంబర్‍లో జరిగిన ఈ సమావేశంలో ఆమె కలెక్టర్‍కు మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా పలు అంశాలపై వారు చర్చించారు.

  • ‘బాధితులకు అండగా ప్రభుత్వం’

    కృష్ణా: చల్లపల్లి మండలం వెలివోలు ఎస్సీ కాలనీలో కొడాలి ఝాన్సీ పూరిల్లు అగ్నిప్రమాదంలో కాలిపోయింది. నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్ ఆమెను పరామర్శించి, గ్రామీణ యువజన వికాససమితి తరఫున నూతన వస్త్రాలు,దుప్పట్లు అందజేశారు. జనసేన పార్టీ తరఫున శ్రీహరి రూ.5,000, రాంబాబు రూ.3,000 ఆర్థికసహాయం అందించారు. వీరబాబు 25కిలోల బియ్యం,పెనుమత్స కృష్ణ వంటపాత్రలు అందజేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని వెంకట్రామ్ తెలిపారు.

  • వైసీపీ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే ఘన నివాళి

    కృష్ణా: వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఆసిఫ్ అకాల మరణం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఘంటసాల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ షుకూర్ కుమారుడు అబ్దుల్ ఆసిఫ్(45) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు అబ్దుల్ ఆసిఫ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

  • ‘డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్ర‌మే ధ్యేయం’

    ఎన్టీఆర్: మాద‌క ద్ర‌వ్యాల‌ను సంపూర్ణంగా నిర్మూలించ‌గ‌లిగితేనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ‌(శాప్) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలోని శాప్ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల నియంత్ర‌ణ దినోత్స‌వాన్ని శాప్ ఛైర్మ‌న్ ఆధ్వ‌ర్యంలో గురువారం నిర్వ‌హించారు.

     

  • ‘విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’

    ఎన్టీఆర్: జాతీయ డ్రగ్ డి ఎడిక్షన్ డే సందర్భంగా ఆశయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం ఎస్సై విజయలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ రాథోడ్ పాల్గొని విద్యార్థులకు గంజాయి వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు వివరించారు.  ఎస్సై  మాట్లాడుతూ విద్యార్థులు ఎవరి ప్రలోభాలకు గురి కావద్దని అన్నారు.

     

  • మొహరం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ

    కృష్ణా: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొహరం సందర్భంగా మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మసీదులు, పంజాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, వెలుతురు సక్రమంగా ఉండాలని కమిషనర్‌ను ఆదేశించారు. నిప్పుల గుండాల వద్ద మట్టి ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలలపాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు.