Locations: Krishna

  • మచిలీపట్నంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం: మంత్రి

    కృష్ణా: 1975లో అమలు చేసిన ఉత్తర్వులను భారతదేశం చీకటి యుగంగా గుర్తుంచుకుంటుందని మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ విధించిన ఎమెర్జెన్సీ చీకటి అధ్యాయానికి 50సంవత్సరాలు అయిందన్నారు. అంతేకాకుండా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

  • స్కూల్ బస్సుల్లో పోలీసుల తనిఖీలు

    ఎన్టీఆర్: విజయవాడలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులను ట్రాఫిక్ CI కిషోర్ బాబు ఆధ్వర్యంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంగా వాహనాలకు సంబంధించిన పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా, తదితర రికార్డులను పోలీసులు పరిశీలించారు. డ్రైవర్, హెల్పర్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్సులో పాఠశాల కాంటాక్ట్ నంబర్, విండోలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టి కిట్‌లు పరిశీలించారు.

     

  • డ్రగ్స్ వద్దు బ్రో: MLA

    ఎన్టీఆర్: మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ఎమ్మెల్యే శ్రీరా  రాజగోపాల్ తాతయ్య అన్నారు.  జగ్గయ్యపేట మత్తు పదార్థాలు సేవించొద్దంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..  డ్రగ్స్ వాడటం అలవాటున్న వ్యక్తులు ఆ అలవాటును మానుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో పట్టణ పోలీసులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • ‘27న విజయవాడలో అమరావతి రథయాత్ర’

    ఎన్టీఆర్: పూరీ తరహాలో విజయవాడలో రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రదారి దాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు కోరిక మేరకు అమరావతి రథయాత్రగా నామకరణం చేసినట్లు చెప్పారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 27,28,29 తేదీల్లో విజయవాడలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. 27న మధ్యాహ్నం 3 గంటలకు సితార గ్రౌండ్ వద్ద ప్రారంభమై.. సీతమ్మవారి పాదాల వద్ద రథయాత్ర ముగుస్తుందన్నారు.

  • శునకాల బెడద తప్పేదెన్నడో?

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణ విధుల్లో శునకాలు సైర్య విహారం చేస్తున్నాయి. పట్టణంలో కుక్కల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో రోజుకు రెండు మూడు డాగ్ బైట్ కేసులు నమోదవుతున్నయని పేర్కొన్నారు. అధికారులు స్పందించే కుక్కల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

     

  • తిరువూరులో కౌన్సిల్ సమావేశం

    ఎన్టీఆర్:  తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ కె.నిర్మల అధ్యక్షతన నేడు కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. పాలకపక్ష, ప్రతిపక్ష కౌన్సిలర్లు, కమిషనర్ కె. మనోజా, కార్యాలయ సిబ్బంది కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారంతా కలిసి  పట్టణాభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధి పనులకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఛైర్ పర్సన్ కోరారు.

     

  • అమ్మవారికి సారె సమర్పించిన హోం మంత్రి

    ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని హోం మంత్రి అనిత దర్శించుకున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. శాకంబరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం వేదపండితులు హోం మంత్రిని ఆశీర్వదించారు.

  • దుర్గమ్మకు తొలి సారె సమర్పించిన ఈవో దంపతులు

    ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, శేష వస్త్రాలను అమ్మవారికి అందజేశారు. తమ చేతుల మీదుగా అమ్మవారికి తొలి సారె సమర్పించడం సంతోషంగా ఉందని ఈవో అన్నారు.

  • ఫ్యాషన్‌లా డ్రగ్స్ వాడకం.. ప్రాణానికి నష్టం

    ఎన్టీఆర్: మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశముందని కంచికచర్ల ఎక్సైజ్ సీఐ అశ్రపున్నిసా బేగం అన్నారు. డ్రగ్స్ సేవించొద్దని కోరుతూ అక్షర కళాశాల విద్యార్థులతో కంచికచర్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ..  డ్రగ్స్ వాడకం యువతలో ఒక ఫ్యాషన్‌గా మారిందని, అది ఆరోగ్యానికి చేసే హానిని గుర్తించే పరిస్థితిలో యువత లేరన్నారు.

  • మైనర్ బాలుడిపై పోక్సో కేసు

    కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో మైనర్ బాలుడిపై బుధవారం రాత్రి పోక్సో కేసు నమోదైంది. పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఐటీఐ చదువుతున్న బాలుడు(17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16ఏళ్ల బాలికను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. నిందితుడిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.