AP : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ఆషాఢ సారెను గురువారం సమర్పించనున్నారు. తొలి సారెను ఉద్యోగులతో కలిసి ఈవో శీనానాయక్ దంపతులు అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై జులై 24 వరకు ఆషాఢసారె సమర్పణ మహోత్సవాలు జరగనున్నాయని EO తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, ధార్మిక సంఘాల నుంచి సారె అమ్మవారికి సమర్పించనున్నారు.
Locations: Krishna
-
రోడ్లన్నీ గుంతమయం.. ప్రయాణం ఓ నరకం!
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి వాహనదారులకు నరకం చూపిస్తోంది. ముఖ్యంగా వెల్వడం-గణపవరం మార్గంలో గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం సాహసంగా మారిందని వాహనదారులు గురువారం మీడియాకు తెలిపారు. నాలుగు నెలలుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైకులు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
వర్షానికి కూలిన గుడిసె.. తప్పిన ప్రమాదం
కృష్ణా: దాలిపర్రులో భారీ వర్షాలకు ఓ గుడిసె కూలిపోయింది. ఘంటసాల మండలం దాలిపర్రుకు చెందిన తూము ప్రసాద్, భార్య, ముగ్గురు పిల్లలతో నివాసముంటున్న గుడిసె బుధవారం రాత్రి కురిసిన వర్షానికి, గాలికి కూలిపోయింది. అది కూలిన సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజా ప్రతినిధులు, దాతలు, అధికారులు స్పందించి సహాయం చేయాలని ఆ నిరుపేద కుటుంబం కోరుకుంటోంది.
-
విజయవాడలో త్వరలో ‘తృప్తి క్యాంటీన్లు’
ఎన్టీఆర్: విజయవాడలో ‘తృప్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల్లూరులో ఈ తరహా క్యాంటీన్లు విజయవంతం కావడంతో మంత్రి నారాయణ సూచనల మేరకు నగరంలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాతబస్తీ వెస్ట్ రైల్వే బుకింగ్ కౌంటర్ సమీపంలోని షాదీఖానా వద్ద ప్రయోగాత్మకంగా మొదటిది ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన మూడు ప్రాంతాల్లో త్వరలో క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.
-
నేటి నుంచి దుర్గమ్మకు ఆషాఢ సారె
ఎన్టీఆర్: ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో కనకదుర్గమ్మకు మొదటిసారెను గురువారం ఆలయ ఈవో వీకే శీనానాయక్ కుటుంబసభ్యులతో కలిసి సమర్పించనున్నారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్త బృందాలు రానున్నాయి. నెలరోజుల పాటు అమ్మవారికి సారె సమర్పిస్తారు. అలాగే నేటి నుంచి దశమి(జూలై 4) వరకు వారాహి అమ్మవారికి పంచ వారాహి మంత్రాలు, జపాలతో యాగశాలలో హోమాలు నిర్వహించనున్నారు.
-
విజయవాడలో నేటి నుంచి 2 రోజుల ‘పర్యాటక కాన్‌క్లేవ్’
AP: రాష్ట్ర పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విజయవాడలో రెండు రోజులపాటు ‘టూరిజం టెక్ ఏఐ 2.0 కాన్‌క్లేవ్’ గురువారం ప్రారంభం కానుంది. పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడులు, సమగ్రాభివృద్ధి, బ్రాండింగ్, కమ్యూనికేషన్, టెక్నాలజీ, ఆర్థిక వనరుల సృష్టి తదితర అంశాలపై మొదటి రోజు నిర్వహించే చర్చలో వివిధ రంగాల నిపుణులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తారు.
-
MLA కొలికపూడి నేటి షెడ్యూల్!
ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేటి పర్యటన వివరాలను ఆయన కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. ఉదయం 9గంటలకు ముత్తగూడెం శివారులోని గుట్టపాడు కాశీ విశ్వనాథుని గుడి వద్ద ఏర్పాటు చేసిన పైప్‌లైన్ పనులను పనులను ప్రారంభించనున్నారు. 10గంటలకు ‘SAY NO TO DRUGS’ ర్యాలీలో పాల్గొంటారు. 11గంటలకు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి, సాయంత్రం 5గంటలకు AMC పాలకమండలి ప్రమాణస్వీకారోత్సంలో పాల్గొంటారన్నారు.
-
‘దయచేసి నా బిడ్డను కాపాడండి’
ఎన్టీఆర్: విస్సన్నపేటకు చెందిన కీర్తిచంద్రిక(12) స్కోలియోసిస్ వ్యాధితో బాధపడుతోంది. వెన్నుముక వంగిపోతుండటంతో ఆపరేషన్ అవసరం. తండ్రి లేని ఆ నిరుపేద కుటుంబానికి రూ.5 లక్షలు భారంగా మారాయి. దాతలు స్పందించి సహాయం చేయాలని తల్లి భార్గవి వేడుకుంటోంది.
-
ప్రమాదం అంచున ఆరుగురి ప్రయాణం
ఎన్టీఆర్: కంచికచర్లలో ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేశారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ముగ్గురు చిన్నారులు, మహిళ, ఆమె ఒడిలో ఓబిడ్డను ఓవ్యక్తి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని వెళ్తున్నాడు. పోలీస్‌స్టేషన్ ఎదురుగానే వెళుతున్న వారిని పట్టించుకున్న నాథుడు లేడని పలువురు ఆరోపిస్తున్నారు. ద్విచక్రవాహనంపై ఇద్దరికి మించి ప్రయాణించడానికి వీలులేదని రవాణా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆచరణలో మాత్రం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కంచికచర్ల పోలీసులు మేల్కొంటారని ఆశిద్దాం.
-
ఆశాల పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేయండి: DM&HO
ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సుహాసిని పేర్కొన్నారు. మొత్తం 61పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పేర్కొన్నారు. ఆయా పోస్టులకు 25-45ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అర్హులన్నారు. ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు https://ntr.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.