Locations: Krishna

  • వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నారు: ఎంపీ

    ఎన్టీఆర్: వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నారని, త్వరలో కార్పొరేషన్ కూటమి కైవసం అవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎంపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చీకటి రోజుగా ప్రకటించారు. వైసీపీ సంఖ్యాబలంతో టీడీపీ ప్రతిపాదనలను తిరస్కరించడం దుర్మార్గమన్నారు. విజయవాడను వైసీపీ నాశనం చేస్తోందని విమర్శించారు.

  • ‘జగన్.. దేశం దాటించిన వేల కోట్లను జమ చేయాలి’

    ఎన్టీఆర్: మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్ దేశం దాటించిన వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 2019లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్, ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలుపెట్టాడని, 151సీట్ల నుంచి 11కి పడిపోయాడని విమర్శించారు. అవినీతితో రాష్ట్రాన్ని రూ.10లక్షల కోట్ల అప్పులో ముంచాడని ఆరోపించారు.

  • రేపటి నుంచి వృద్ధులకు రేషన్ పంపిణీ

    కృష్ణా: పెడనలో రేపటి నుంచి 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల తహశీల్దార్ కార్యాలయంలో డీలర్లతో సమావేశం నిర్వహించి, పంపిణీపై సూచనలు చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా పంపిణీ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు.

     

  • ‘కొండపల్లికి వరంగా అమృత్ పథకం’

    ఎన్టీఆర్: కొండపల్లి పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో రూ.57.12కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో ఇంటింటికీ కుళాయి ఇవ్వాలనే 45సంవత్సరాల కల ఈ పథకం ద్వారా త్వరలో సాకారం కాబోతుందన్నారు.

  • ‘సొంత మండలాలకే ట్రాన్సఫర్ చేయండి’

    కృష్ణా: పెడన మండల పరిధిలోని గ్రామ సర్వేయర్ ఉద్యోగులు తమను సొంత మండలాలకు కాకుండా ఇతర మండలాలకు బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రేషనలైజేషన్‌ను రద్దు చేసి, ప్రమోషన్లు కల్పించాలని, జీవో నెంబర్-5 సవరణ చేయాలని డిమాండ్ చేశారు. సొంత మండలాల్లోనే ట్రాన్సఫర్ ఇవ్వాలని కోరుతూ ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ అనిల్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.

     

  • గంజాయి కేసులో నలుగురు అరెస్ట్

    ఎన్టీఆర్: గంపలగూడెం మండలం పెదకోమిర గ్రామంలోని ESSAR పెట్రోల్ బంకు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని, ఒక్కొక్కరి వద్ద అరకిలో చొప్పున రెండు కిలోల గంజాయి, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

     

     

  • ‘రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం’

    కృష్ణా: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం అని మండల ఎంఆర్ఐ కృష్ణమోహన్ అన్నారు. బుధవారం చల్లపల్లి మండలం వెలివోలు ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాద బాధితురాలు కొడాలి ఝాన్సీకి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శాఖ వారి సహకారంతో స్టీల్ సామాగ్రి, హెవీ టార్పాలిన్ అందజేశారు. చల్లపల్లి సబ్ బ్రాంచ్ ద్వారా నిత్యావసర సరుకులు,బియ్యం,దుప్పట్లు,చీర అందించారు. సీనియర్ జర్నలిస్ట్ బాబూరావు 2చీరలు అందజేశారు.

  • ఇదేం న్యాయం..! స్కూలు తీసేసి వైన్ షాపులకు పర్మీషన్..

    ఎన్టీఆర్: విస్సన్నపేట బీసీ కాలనీలో ఎంపీపీ స్కూలు విలీనంపై సీపీఎం నాయకుడు విస్సంపల్లి నాగరాజుతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూలు తీసేసి వైన్ షాపులకు అనుమతిస్తున్నారని, పేద తల్లిదండ్రుల ఆవేదనను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. దూర ప్రాంతాలకు చదువుకు వెళ్లాల్సి వస్తుందని, పేదలకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

  • రామాపురంలో పేకాట రాయుళ్ల అరెస్ట్‌

    కృష్ణా: కృతవెన్ను మండలం రామాపురంలో పేకాట స్థావరంపై ఎస్సై పైడి బాబు మంగళవారం మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,110 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

  • ‘ఆధునిక వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు’

    కృష్ణా: పెడన మండలం పరిధిలోని పెనుమల్లి గ్రామ రైతు సేవా కేంద్రంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి సబ్జా జర్నీ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతి ఖాతాపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా రైతులకు శిక్షణ వంట పద్ధతులపై సూచనలు అందిస్తున్నామన్నారు.