Locations: Krishna

  • అనాథలకు చేయూతనిచ్చిన యువత

    కృష్ణా: మోపిదేవి మండలం కోసూరువారి పాలెం నుంచి గ్రామీణ యువజన వికాస సమితి అనాథ విద్యార్థుల పట్ల తమ మానవత్వాన్ని చాటుకుంది. హీల్ పారడైజ్ అనాథ ఆశ్రమానికి రూ.25వేల విలువైన కూరగాయలు అందించారు. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలి వెంకట్రామ్ ఆటోను ప్రారంభించి, సహాయం అందించారు. రైతులు క్రమం తప్పకుండా సహాయం చేస్తుండటం అభినందనీయమన్నారు.

  • ‘మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు’

    ఎన్టీఆర్: మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటమే కాక ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని నందిగామ ఏసీపీ తిలక్ అన్నారు. మత్తు పదార్థాలను
    సేవించవద్దని కోరుతూ పరిటాల ముత్తువరపు వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కంచికచర్లలో అవగాహన ర్యాలీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కోరారు.

  • ‘సమాచార సేకరణ ఇకపై సులభతరం’

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మెప్మా సిబ్బందికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్యాబ్‌ల ద్వారా సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయగలరని అన్నారు. సమాచార సేకరణ ఇకపై సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.

     

  • రేపు జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు 

    ఎన్టీఆర్: ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 26న పొన్నవరంలోని ఏకత్వ పబ్లిక్ స్కూల్ ఇండోర్ హాల్‌లో అండర్-10, అండర్-12 బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని కార్యదర్శి నాగం సతీష్ తెలిపారు.అండర్-10 (2016 తర్వాత జన్మించినవారు), అండర్-12(2014 తర్వాత జన్మించినవారు) అర్హులన్నారు. గుర్తింపు కార్డు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. మరెన్ని వివరాలకు 9553528888 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.

  • కంకిపాడు బస్టాండ్‌లో కనీస సౌకర్యాల కరువు..!

    కృష్ణా: కంకిపాడు బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవు. కుర్చీలు, బల్లలు ఉన్నా, అవి మందుబాబులకే పరిమితమయ్యాయి. 24 గంటల ఫ్యాన్, టేబుల్స్ వారికి హాయిగా ఉన్నాయి. ప్రయాణికులు బయట ఇబ్బంది పడుతుంటే, సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రయాణికులు పడిగాపుల్లో ఉండగా, మందుబాబులు నిద్రలో హాయిగా ఉన్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

  • కంచికచర్లలో ‘అగ్నిమాపక మాక్ డ్రిల్’

    ఎన్టీఆర్: కంచికచర్ల అగ్నిమాపక కేంద్ర అధికారి శివారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది స్థానిక విజయ రాణి పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ముందుగా ఏటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే తదితర అంశాలపై అవగాహ కల్పించారు. ప్రమాదంలో ఉన్నవారిని ఎలా రక్షించాలనే.. అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై విద్యార్థులకు ప్రదర్శన ద్వారా వివరించారు.

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట నిరుద్యోగులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గుడ్ న్యూస్ తెలిపారు. శ్రీరామ్ అమ్మాణి కాలేజీలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. APSSDC, SEEDAP ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పది ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్, బీటెక్, పీజీ పూర్తి చేసిన 18-35 సంవత్సరాల వయసు ఉన్న యువతీ,యువకులు అర్హులన్నారు.

  • నందిగామలో నూతన బోర్ల ప్రారంభం

    ఎన్టీఆర్: నందిగామ 11వ వార్డులో నూతనంగా నిర్మించిన బోర్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో నందిగామ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఎమ్మెల్యే కృషితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

  • ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి’

    కృష్ణా: ఆత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హనుమాన్ జంక్షన్ సీఐ కె.వి.ఎం.ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు ఆరోగ్యం, సమాజంలో గౌరవాన్ని దెబ్బతీస్తాయని, తెలిసో తెలియని వయసులో వీటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి పెడితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని సూచించారు.

     

  • మైలవరంలో దంచికొట్టిన వాన!

    ఎన్టీఆర్: మైలవరం పరిసర ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. మే నెల రెండవ వారంలో సాగుచేసిన మొక్కజొన్న, పత్తి, నువ్వు పంటలు వర్షం లేక ఎండు ముఖం పట్టాయి. ఎట్టకేలకు మైలవరం పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.