ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలంలోని బూరుగగూడెంలో టీడీపీ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. జయమ్మ అనే మహిళ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చొరవ తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.30,000 మంజూరు చేయించారు. టీడీపీ నాయకులు ఆ చెక్కును బాధిత కుటుంబానికి అందజేసి అండగా ఉంటామని తెలిపారు.
Locations: Krishna
-
ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సీఐ చంద్రశేఖర్, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ జర్నలిస్టుల సేవలను కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ ఫర్హీన్ సూచనలు చేశారు.
-
30 వాహనాలపై కేసులు నమోదు
ఎన్టీఆర్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన చోదకులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. నందిగామ మండలం అంబారుపేట వైజంక్షన్ జాతీయ రహదారిపై నిబంధనలు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులు వాహనాలకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు, రికార్డులు తనిఖీ చేసి 30 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తెలిపారు.
-
కంచికచర్లలో భారీ వర్షం.. రైతులకు ఊరట!
ఎన్టీఆర్: కంచికచర్ల ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. మే నెల రెండవ వారంలో సాగుచేసిన మొక్కజొన్న, నువ్వు పంటలు వర్షం లేక ఎండు ముఖం పట్టాయి. ఎట్టకేలకు కంచికచర్ల ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పునాస పంటలకు ప్రాణం పోసిందన్నారు.
-
మంత్రి లోకేష్‌కు ఆత్మీయ స్వాగతం
కృష్ణా: గుడివాడలో మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే రాము ఆత్మీయ స్వాగతం పలికారు. మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్న లోకేష్‌కు నిమ్మకూరులో ఘనంగా స్వాగతం లభించింది. ఎమ్మెల్యేలు రాము, వర్ల కుమార్ రాజా పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. లోకేష్ ప్రజలను కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. లోకేష్ వెంట ఎమ్మెల్యేలు, తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా మచిలీపట్నం తరలివెళ్లారు.
-
ఎంపీ కేశినేనిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
ఎన్టీఆర్: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ ఇన్సూరెన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై వారు చర్చించారు. అనంతరం ఆయనను ఎంపీ కేశినేని శాలువాతో సత్కరించారు.
-
చింతల కాలనీలో ఎమ్మెల్యే కొలికపూడి పర్యటన
ఎన్టీఆర్: తిరువూరు చింతల కాలనీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే వారు స్పందించి, మురుగునీరు ఇళ్లల్లోకి చేరకుండా జేసీబీ సహాయంతో డ్రైనేజీ కాల్వలో ఉన్న పూడికను తీయించారు. ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఇరాన్‌పై అమెరికా దాడులు ఖండిస్తూ వామపక్ష పార్టీల నిరసన
ఎన్టీఆర్: ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వారు ఖండించారు. ప్రపంచ శాంతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
విద్యాసంస్థల్లో అక్రమాలపై AISF నిరసన
కృష్ణా: కానూరులో AISF ఆధ్వర్యంలో విద్యాసంస్థల అక్రమాలపై నిరసన జరిగింది. రాష్ట్రంలో విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, వాటిలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఫీజుల నియంత్రణ లేదని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
-
ఫిక్కీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ: చంద్రబాబు
ఎన్టీఆర్: ఫిక్కీ ఆధ్వర్యంలో విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యనిర్వహక సంఘ సమావేశాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిక్కీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని, సంఘంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే సంస్థ అని అన్నారు. దావోస్‌కి వెళ్లి పారిశ్రామికులని కలిశామని, పొలిటీషియన్స్ అందరూ కలుసుకునే ఒక గొప్ప అవకాశాన్ని పొందే ప్రదేశమని అన్నారు.