Locations: Krishna

  • విజయవాడలో ఫిక్కీ సమావేశం

    ఎన్టీఆర్: ఫిక్కీ (FICCI-ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యనిర్వహక సంఘ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. సమావేశంలో ప్రముఖ కంపెనీల అధిపతులు, డైరెక్టర్లు, ప్రెసిడెంట్లు, ఛైర్మన్లు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు.

     

  • మురుగు కాలువ పూడిక తీత పనులు ప్రారంభం

    కృష్ణా: పెడన మండల పరిధిలోని దావోజీపాలెం గ్రామంలో పరకోడు నుంచి భూదేవి వరకు గల మురుగు కాలువ అకాల వర్షాలు, వరదల కారణంగా నిండిపోయింది. దీంతో కాలువకు ఇరువైపులా ఉన్న రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలో నందిగామ గ్రామ ఉప సర్పంచి కాగిత లక్ష్మి నాగేశ్వరావు ఆయన సొంత ఖర్చులతో మురుగు కాలువ పూడికతీత పనులను బుధవారం ప్రారంభించారు.

  • రేపటి నుంచి వృద్ధులకు రేషన్ పంపిణీ: తహశీల్దార్

    కృష్ణా: ప్రభుత్వ ఆదేశాల మేరకు పెడనలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు గురువారం నుంచి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్లు తహశీల్దార్ అనిల్‌కుమార్ తెలిపారు. ప్రతి నెల 1 తేదీ నుంచి రేషన్ ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 5 రోజులు ముందుగా వృద్ధులకు, వికలాంగులకు వారి ఇళ్లకు వెళ్లి రేషన్ అందించాలన్నారు.

  • రెడ్‌బుక్‌ పేరు వింటే YCP నేతలకు గుండెపోటు : మంత్రి లోకేశ్‌

    AP: రెడ్‌బుక్‌ పేరు వింటే YCP నేతలకు గుండెపోటు వస్తోందని మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం విచ్చేసిన లోకేశ్‌కు మంత్రులు, ప్రజాప్రతినిధులు, TDPశ్రేణులు ఘనస్వాగతం పలికారు. పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేశామని ఈ సందర్భంగా లోకేశ్‌ తెలిపారు. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని లోకేశ్‌ స్పష్టం చేశారు.

  • ‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో లోకేశ్ ముఖాముఖి

    కృష్ణా: మచిలీపట్నంలో ‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ‘‘పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం అమలు చేశాం. నాకు, బ్రహ్మణికి చిన్న వయస్సులోనే పెళ్లయ్యింది. ఇంటి పనులు ఇద్దరం సమానంగా చేసే వాళ్లం. మా అమ్మ త్యాగం చేయకపోతే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరు. రెడ్‌బుక్ పేరు వింటే గుండెపోటు వస్తుంది’’ అన్నారు.

  • YCP నేత లాడ్జీలో వ్యభిచారం

    ఎన్టీఆర్: విజయవాడ గవర్నర్‌పేట అట్టారత్తయ్య వీధిలో YCP నేత కోసూరు మణికి చెందిన లాడ్జీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టుచేశారు. పక్కా సమాచారంతో సోమవారం అర్థరాత్రి దాడిచేశారు. మణితో సహా ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు యువతులను కాపాడి వసతిగృహానికి తరలించారు. మణి ఆగడాలపై స్థానికులు ఫిర్యాదు మేరకు సీపీ ఆదేశాలతో దాడులు నిర్వహించారు.

  • తానా సభకు ఎమ్మెల్యే సౌమ్య రాక

    కృష్ణా: తానా మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో తానా చేస్తున్న కృషి అభినందనీయమని నిర్వాహకులు అన్నారు. ఈ సభలో ఆమె ప్రసంగం కోసం తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.

  • రేలింగ్ గోడను ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

    గుంటూరు: కనకదుర్గ వారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు-విజయవాడ వెళ్తున్న ట్రాలీ లారీ ఫుట్‌పాత్ దాటుకొని రేలింగ్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, లారీ వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

  • మచిలీపట్నంలో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

    కృష్ణా: మచిలీపట్నం చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతించారు. తల్లికి వందనం లబ్దిదారులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. మరికాసేపట్లో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం.

  • చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

    ఎన్టీఆర్: లిక్కర్ కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మోహిత్ రెడ్డి విచారణకు హాజరు అవుతారా? లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా మోహిత్ రెడ్డి ఇప్పటికే ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు.