Locations: Krishna

  • నిమ్మకూరులో లోకేశ్‌కు ఘనస్వాగతం

    కృష్ణా: స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో మంత్రి నారా లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. మచిలీపట్నం పర్యటనలో భాగంగా పామర్రు మండలం నిమ్మకూరుకు చేరుకున్న లోకేశ్‌కు తెలుగుతమ్ముళ్లు గజమాలతో స్వాగతం పలికారు. లోకేశ్‌కు ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, వెనిగండ్ల రాము పుష్పగుచ్చాలు అందించి స్వాగతించారు. నిమ్మకూరు ఆడపడుచులు మంగళ హారుతులిచ్చారు. అందరూ బాగున్నారా అంటూ గ్రామస్థులు, టీడీపీ శ్రేణులను ఆత్మీయంగా లోకేశ్ పలకరించారు.

  • రోడ్డుపై మురుగు.. స్పందించండి మహాప్రభో!

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలో మురుగు కాలువల సమస్య తీవ్రంగా ఉంది. విజయరాణి కాన్వెంట్ దారిలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ దారి గుండా నిత్యం 500మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. ఈ మురికి నీటిలో నడుచుకుంటూ వెళ్లడం వల్ల పిల్లలకు వ్యాధులు సోకే పరిస్థితి ఏర్పడుతుందని, అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • తెగుళ్ళ నివారణకు జీవ నియంత్రణ

    ఎన్టీఆర్: ఖరీఫ్ సాగులో జీవ నియంత్రణ పద్ధతులు ఎంతో అవసరమని జీవ నియంత్రణ ప్రయోగశాల ADA డీఎల్ కిరణ్ జ్యోతి తెలిపారు. రైతులు రసాయన మందుల వాడకం తగ్గించి, పంటలను కాపాడుకోవచ్చని ఆమె సూచించారు. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ వంటి జీవ నియంత్రణ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని విత్తన శుద్ధికి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.

  • కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రేపు

    ఎన్టీఆర్: కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు విజయవాడలోని రామ ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

  • ‘పశువుల పెంపకంలో మెళకువలతో మంచి ఆదాయం’

    ఎన్టీఆర్: పశువుల పెంపకంలో పశు పోషకులు మెళకువలు పాటిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చని పశుసంవర్ధక శాఖ JD ఎం.హనుమంతరావు అన్నారు. మండల పరిధిలోని మూలపాడు, త్రిలోచనాపురం రైతు సేవా కేంద్రాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. పశు పోషకులకు పలు పథకాలను వివరించారు. మండల వ్యవసాయశాఖ అధికారి యడవల్లి రజని ప్రస్తుతం వ్యవసాయ శాఖలో పథకాలు, కార్యక్రమాలు, సాగులో మెళకువలను రైతులతో చర్చించారు.

  • లోక్ అదాలత్.. ‘సద్వినియోగం చేసుకోండి’

    కృష్ణా: బంటుమిల్లిలోని జూనియర్ సివిల్ కోర్టులో జులై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.భాస్కర రావు తెలిపారు. అందులో ఎక్కువ కేసులు పరిష్కరించేల ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్‌ను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • రేపు గురుకుల తక్షణ ప్రవేశాలు.. అర్హులు వీరే!

    కృష్ణా: పెడన మండలం బల్లిపర్రు డా. బాలయోగి బాలికల గురుకులంలో ఇంటర్ సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు తక్షణ ప్రవేశాలను గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్.రూతమ్మ తెలిపారు. జి.కొండూరు మండలం కుంటముక్కల గురుకులంలో 2జిల్లాల స్థాయిలో ప్రవేశాలు  జరగనున్నాయి. ఈప్రవేశాలకు ఉదయం 9గంటలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని, గురుకుల ప్రవేశపరీక్ష రాసిన బాలికలు మాత్రమే అర్హులన్నారు.

  • నేడు మచిలీపట్నంలో మంత్రి పర్యటన

    కృష్ణా: విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య నాయకులు, ఎంపిక చేసిన కార్యకర్తలతో ఆయన మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారని, పార్టీ పరంగా పలు సూచనలు చేస్తారని టీడీపీ రాష్ట్ర నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు.

  • స్థానికుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే తనయుడు

    ఎన్టీఆర్: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది. బందుల దొడ్డి సెంటర్ వద్ద భారీ చెట్టు విరిగి విద్యుత్ వైర్లపై పడింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తనయుడు, టీడీపీ నాయకులు గద్దె కాంత్ కుమార్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టారు. స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

  • అమరావతి నిర్మాణానికి 36 గ్రాముల బంగారు గాజులు, నగదు విరాళం

    AP : రాజధాని అమరావతి నిర్మాణానికి తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులు సచివాలయంలో CM చంద్రబాబును కలిసి విరాళమిచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మి 36 గ్రాముల బంగారు గాజులు, రూ.లక్ష చెక్కు ఇచ్చారు. విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలనే ఆకాంక్షతో వృద్ధులు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.