ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగుల సీట్ల భర్తీకి నేడు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు సమన్వయ అధికారి ఎ.మురళీకృష్ణ తెలిపారు. 6, 7, 8, 9 తరగతుల బాలురకు కృష్ణారావుపాలెంలో, బాలికలకు కుంటముక్కలలో బుధవారం పరీక్ష ఉంటుందని తెలిపారు. 6, 7 తరగతులకు ఉదయం 8, 9 తరగతులకు మధ్యాహ్నం పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.
Locations: Krishna
-
‘ఆ డిగ్రీ కళాశాలకు రీసెర్చ్ గ్రాంటుతో గుర్తింపు’
ఎన్టీఆర్: మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.31.5లక్షల రీసెర్చ్ గ్రాంటును మంజూరు చేసింది. వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.జె.రాముడు ఆర్కిడ్ మొక్కలపై జరిపే పరిశోధనకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు కనుమల్లోని ఆర్కిడ్ల ఔషధ గుణాలను, జీవశాస్త్ర సంబంధిత అంశాలను అధ్యయనం చేస్తారు. ఇది కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ రవి తెలిపారు. అధ్యాపకులను సిబ్బంది అభినందించారు.
-
‘గ్రామ కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలి’
కృష్ణా: పెడన నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు సమావేశం జరిగింది. కార్యక్రమానికి పెడన నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గ్రామ కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
-
ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు
ఎన్టీఆర్: మైలవరం మాదాల బుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్లస్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఐఐటీలో సీట్లు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు వై.రాజశేఖర్ తెలిపారు. వీరు ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో స్టేట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
-
రసాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ఎన్టీఆర్: విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఏపీఐఐసీ కాలనీలోని జమాక్ అపార్ట్‌మెంట్‌కి తాగునీరు అందించాలని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఆ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నవారు టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో వైసీపీ అధికారపక్షం వారికి తాగునీరు అందించడం లేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు. నగరప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో వైసీపీ పాలకపక్షం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
-
‘చంద్రబాబు స్ఫూర్తి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి’
ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఛైర్మన్‌గా ఎన్నికైన చెన్నుబోయిన చిట్టిబాబును మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య మర్యాదపూర్వకంగా కలిశారు. చిట్టిబాబును శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలని తెలిపారు.
-
‘రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేయాలి’
కృష్ణా: తమకు మేలు చేకూరేలా బదిలీలు చేపట్టాలని ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గోపిచంద్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెరిట్ కమ్, సీరియార్టీ ప్రకారం గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. రేషవలైజేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలన్నారు.
-
పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరసింహారావు
కృష్ణా జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా మచిలీపట్నంకు చెందిన సీనియర్ న్యాయవాది మాదివాడ వెంకట నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వారు నియామక ఉత్తర్వులు అందజేశారు. మూడు సంవత్సరాల పాటు ఆయన పీపీగా వ్యవహరించనున్నారు. నరసింహరావు నియామకం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
-
‘అంబేద్కర్‌ను కించపరిస్తే.. ఉపేక్షించేది లేదు’
ఎన్టీఆర్: దళిత నేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ వైసీపీ నాయకులు తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని వారు అన్నారు. కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు స్పాట్ డెడ్
ఎన్టీఆర్: నందిగామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. కంచికచర్ల శివ సాయి క్షేత్రం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో పెండ్యాల గ్రామానికి చెందిన సమీర్ పాషా(20) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చరికి తరలించారు.